Devarakadra: దేవరకద్రలో ఫిల్టర్ ఇసుక దందాపై రెవెన్యూ, పోలీసుల దాడి!

Devarakadra: దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో అక్రమంగా ఫిల్టర్ ఇసుక తరలిస్తున్న 4 ట్రాక్టర్లు, 2 జేసీబీలను రెవెన్యూ, పోలీస్ అధికారులు పట్టుకున్నారు.

GOKARANNA,  GADWAL
Published on: 24 Aug 2026 10:34 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రలో ఫిల్టర్ ఇసుక దందాపై రెవెన్యూ, పోలీసుల దాడి!

దేవరకద్ర: దేవరకద్ర మండల పరిధిలోని వెంకటయ్య పల్లి గ్రామ పరిధిలో అక్రమంగా ఫిల్టర్ ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో తాహసిల్దార్ హర్షద్, పోలీస్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలో ఫిల్టర్ ఇసుక తరలిస్తున్న వెంకటాయపల్లి గ్రామానికి చెందిన నాలుగు ట్రాక్టర్లు, రెండు జెసిబి లను అధికారులు పట్టుకున్నారు.

వాహనాలను స్వాధీనం చేసుకుని సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తాసిల్దార్ హర్షద్, హెడ్ కానిస్టేబుల్ శివ శరణయ్య తెలిపారు. అక్రమ ఇసుక రవాణా పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు.

అక్రమ ఇసుక రవాణా పై రెవిన్యూ పోలీస్ అధికారులు నిరంతరం నిఘా ఉంచుతామని, ఎక్కడైనా అక్రమాలకు పాల్పడితే వాహనాలను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేస్తామని తాసిల్దార్ హర్షద్, పోలీస్ అధికారులు తెలిపారు. తాహసిల్దార్ వెంబడి, జిపిఓ లు గద్దెగూడెం, వెంకటాయపల్లి జిపిఓ అబ్దుల్ ఖాదర్, దేవరకద్ర జిపిఓ రాజు, పోలీస్ అధికారులు,తదితరులు పాల్గొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story