Nagarkurnool: పేద కుటుంబాలకు గోలి శ్రీనివాస్ రెడ్డి సాయం!

Nagarkurnool: వెల్దండ మండలం చేర్కూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 5 Aug 2026 1:55 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: పేద కుటుంబాలకు గోలి శ్రీనివాస్ రెడ్డి సాయం!

Nagarkurnool: మృతుడి కుటుంబానికి పరామర్శ –రూ.5,000 ఆర్థిక సాయం.

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం

వెల్దండ మండలం, చేర్కూర్ గ్రామపంచాయతీకి చెందిన చేర్క వెంకటయ్య ఇటీవల మృతి చెందిన విషయం గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు ద్వారా తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం వారి కుటుంబానికి అండగా నిలుస్తూ రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

గాయపడిన వ్యక్తికి వైద్య ఖర్చుల కోసం రూ.5,000 సాయం_

అదే గ్రామానికి చెందిన వంగూరి లక్ష్మయ్య ప్రమాదవశాత్తు కాళ్లకు గాయమై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి,వారి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు,జిల్లా నాయకులు నాగులు నాయక్, మాజీ సర్పంచ్ అంజి నాయక్, మైసయ్య, మాజీ ఎంపీటీసీ భీమయ్య,ఉప సర్పంచ్ కొండల్,నర్సింహా,నాయకులు తారాసింగ్,మెండే శ్రీను,వార్డు సభ్యులు లాలయ్య,రమేష్,అల్లే సందీప్,సాయి, శ్రీరాములు,బాలయ్య, గడ్డం శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story