Gadwal: గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో 6 కేజీల గంజాయి స్వాధీనం!

Gadwal: గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో 6 కేజీల గంజాయిని పట్టుకున్న టౌన్ పోలీసులు. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్, బైక్ స్వాధీనం.

GOKARANNA,  GADWAL
Published on: 31 Aug 2026 11:02 AM IST
Gadwal
X

Gadwal: గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో 6 కేజీల గంజాయి స్వాధీనం!

Gadwal: గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో నమ్మదగిన సమాచారం మేరకు గంజాయిని పట్టుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. గద్వాల జిల్లా, గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆదివారం రోజు సాయంత్రం 6 గంటల సమయంలో నమ్మదగిన సమాచారం మేరకు గద్వాల పట్టణ పోలీసులు 6 కిలోల గంజాయిని పట్టుకొని గంజాయిని తీసుకు వస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి నుంచి బైకును స్వాధీనం చేసుకున్నారు గద్వాల పోలీస్ లు. ఇద్దరు వ్యక్తులలో ఇటిక్యాల మండలం కు చెందిన సెనగపల్లి గ్రామానికి చెందిన ఒకరు కాగా మల్దకల్ మండలం విటలాపురం పురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం మరికొందరు పరారైనట్లుగా తెలుస్తోంది.

మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు గద్వాల పట్టణ పోలీసులు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story