Gadwal: గద్వాల చేనేత బ్రాండ్‌ను కాపాడుకోవాలి ఎమ్మెల్యే బండ్ల

Gadwal: గద్వాలలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. భౌగోళిక గుర్తింపు పొందిన గద్వాల చేనేత బ్రాండ్‌ను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.

GOKARANNA,  GADWAL
Published on: 7 Aug 2026 6:53 PM IST
Gadwal
X

Gadwal: గద్వాల చేనేత బ్రాండ్‌ను కాపాడుకోవాలి ఎమ్మెల్యే బండ్ల

గద్వాల: గద్వాల చేనేత బ్రాండ్ ను కాపాడుకోవాలి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. బ్యాంకుల ద్వారా కార్మికులకు రుణాలు ఇప్పించేందుకు కృషి గద్వాలలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. పట్టు, కాటన్ సమ్మిళితం చేస్తూ గద్వాల చేనేత జరీ చీరలను నేస్తుంటారని, భౌగోళిక గుర్తింపును పొందిన ఈ బ్రాండ్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.

శుక్రవారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో ఐడిఓసి సమావేశపు మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన చేనేత సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని, త్వరలోనే సంఘాల ప్రతినిధులు బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి కార్మికులకు రుణాలు ఇప్పించేందుకు కట్టుబడి ఉన్నామన్నారు.

ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రవేశపెట్టిన వివిధ పథకాలను అర్హులైన కార్మికులందరూ సద్వినియోగం చేసుకునేలా జియో టాగ్ నెంబర్లను ఇప్పించడం జరుగుతుందన్నారు. భవిష్యత్తు తరాలు కూడా చేనేత వృత్తిలో ఆర్థిక పురోగతి సాధించేలా గద్వాల చేనేత రంగాన్ని పటిష్టం చేసేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానన్నారు.

వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధిక జనాభా చేనేత వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తోందని, స్వాతంత్ర ఉద్యమంలోనూ గాంధీజీ విదేశీ వస్త్రాలను బహిష్కరించి స్వదేశీ చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు కృషిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. గద్వాల సంస్థానాధీశులు వందేళ్ళ కిందటే ఇక్కడి కొంతమంది చేనేత కళాకారులను బెనారస్ పంపించి వృత్తిలో నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ప్రోత్సహించారన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story