Gadwal: గద్వాలలో పంద్రాగస్టు వేడుకలు కలెక్టర్ రిజ్వాన్ దిశానిర్దేశం!

Gadwal: జోగులాంబ గద్వాల జిల్లాలో పంద్రాగస్టు వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.

GOKARANNA,  GADWAL
Published on: 11 Aug 2026 5:45 PM IST
Gadwal
X

Gadwal: గద్వాలలో పంద్రాగస్టు వేడుకలు కలెక్టర్ రిజ్వాన్ దిశానిర్దేశం!

Gadwal: గద్వాల జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో అట్టహాసంగా నిర్వహించేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో మంగళవారం అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు.

పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న ఈ వేడుకకు సంబంధించి వేదిక, పారిశుధ్యం, త్రాగు నీరు, సీటింగ్, తదితర ఏర్పాట్లను పక్కాగా చేసుకోవాలని సూచించారు.

ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా వేడుకలు సజావుగా జరిగేలా ఆయా శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వివిధ వర్గాల వారి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిబింబించేలా జిల్లా ప్రగతి నివేదిక రూపొందించాలని ఆదేశించారు. వివిధ శాఖల పనితీరును చాటేలా స్టాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రొటోకాల్ ను అనుసరిస్తూ అతిథులకు ఆహ్వానాలు పంపాలని సూచించారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story