Gadwal: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
Gadwal: గద్వాల్ జిల్లాలో ఈనెల 31న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఆలంపూర్‌లో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు.
Gadwal: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
గద్వాల్: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అలంపూర్ పర్యటనను విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు..ఈనెల 31న కేంద్ర మంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ ఆలంపూర్ లో ఏర్పాట్లు పరిశీలించారు.
ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్ ను సందర్శించారు. అమృత్ భారత్ స్టేషన్స్ పథకం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి పరిశీలించడం జరుగుతుందన్నారు. స్టేషన్లో ప్రయాణికులు వేచి ఉండు హాల్స్ ను, టికెట్ కౌంటర్, ఇతర విభాగాలను కలెక్టర్ పరిశీలించారు.
జోగులాంబ స్టేషన్ అభివృద్ధి పనులను, ఈ స్టేషన్ మీదుగా రైళ్ల రాకపోకల వివరాలను అసిస్టెంట్ రైల్వే డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ కు తెలియజేశారు. డబ్లింగ్ పనులకు అవసరమైన భూ సేకరణ జిల్లా పరిధిలో పూర్తయిందని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.
ఆలంపూర్ పట్టణంలోని హరిత హోటల్ సందర్శించిన కలెక్టర్ అక్కడికి మంత్రి వస్తున్నందున అవసరమైన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ ఆలంపూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి 22 ఏ కింద వ్యవసాయ, వ్యవసాయతర భూముల వివరాలను సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ, ఇతర ఓటర్లకు నోటీసుల పంపిణీ, హియరింగ్ ప్రక్రియలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడారు.
అనంతరం ప్రసాద్ పథకంలో భాగంగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. అక్కడి అన్నప్రసాద కేంద్రంలో నిర్వహణపై ఆరా తీశారు. భక్తులకు భోజనాన్ని రుచికరంగా వండి పెట్టాలని సిబ్బందిని ఆదేశించారు. అలంపూర్ ఆలయాల సమీపంలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సౌండ్స్ అండ్ లైట్స్ ప్రదర్శనను కేంద్రమంత్రి ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్రస్థాయిలో సమీక్షించారు.




