Veldanda: పోతేపల్లి బడి పిల్లలకు గ్రామ దాతల చేయూత: షూస్, సాక్స్ పంపిణీ!
Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి జెడ్పీహెచ్‌ఎస్, ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు గ్రామ దాతల సహకారంతో ఉచితంగా షూస్, సాక్స్ పంపిణీ చేశారు.
Veldanda: పోతేపల్లి బడి పిల్లలకు గ్రామ దాతల చేయూత: షూస్, సాక్స్ పంపిణీ!
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం పోతేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులకు దాతల సహకారంతో షూస్, సాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోతేపల్లి గ్రామ దాతలు తగుళ్ల అంజి మాస్టర్, బోయినపల్లి లింగమయ్య గౌడ్, వార్డు సభ్యులు గోరటి అశోక్ కుమార్, ఉపసర్పంచ్ శారద బాలయ్య గౌడ్, బోయినపల్లి జగన్ గౌడ్ లు దాతలుగా ముందుకు వచ్చి విద్యార్థులకు షూస్, సాక్స్ అందజేశారు.
విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించేందుకు ముందుకు వచ్చిన దాతలను ఈ సందర్భంగా పాఠశాలల ఉపాధ్యాయులు అభినందించారు. షూస్, సాక్స్ అందుకోవడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా కొనసాగించాలని కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.




