Veldanda: పలుగు తండాలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

Veldanda: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పలుగు తండాలో ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, 180 మందికి పైగా వైద్య పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 24 Aug 2026 9:37 PM IST
Veldanda
X

Veldanda: పలుగు తండాలో ఉచిత వైద్య శిబిరం ప్రారంభం

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పరిధిలోని పలుగు తండా గ్రామ పంచాయతీలో ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి సౌజన్యంతో సోమవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

డాక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ వైద్య శిబిరాన్ని సర్పంచ్ సభావత్ రమేష్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఉచిత వైద్య శిబిరాలు గ్రామీణ పేదలకు ఎంతో ప్రయోజనమని, ముందస్తుగా వ్యాధులను గుర్తించుటకు వైద్య శిబిరాలు దోహదపడతాయని పేర్కొన్నారు.

బిపి,షుగర్ కంటికి సంబంధించిన పరీక్షలు నిర్వహించారు.వైద్య శిబిరంలో సుమారు 180 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి,ఉచిత మందులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనిత పంతు నాయక్,డాక్టర్ లింగం,కామినేని ఆసుపత్రి సీనియర్ ఎగ్జిక్యూటివ్ కే. దేవేందర్ గౌడ్,ఆప్తమాలజీ వైద్యులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story