Mahabubnagar: కుమారులు విదేశాల్లో.. తల్లి భూమిపై కబ్జాదారుల కన్ను నలుగురి అరెస్ట్

Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా కోడూర్ శివారులో భూమి కబ్జా. తప్పుడు పత్రాలు సృష్టించి ఏడెకరాల భూమిని కాజేసిన కేటుగాళ్లు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 8 April 2026 12:19 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: కుమారులు విదేశాల్లో.. తల్లి భూమిపై కబ్జాదారుల కన్ను నలుగురి అరెస్ట్

Mahabubnagar: కోడూర్ గ్రామ శివారులో ఉన్న సర్వే నెంబర్ 29 సర్వే నెంబర్ 30 సర్వే నెంబర్ 136 మరియు సర్వే నెంబర్ 240 లో ఉన్న మొత్తము పొలము 7 ఎకరాల 11 గుంటల భూమి పై తప్పుడు పత్రాలు తయారు చేసి, సంతకం ఫోర్జరీ చేసి ఇతరులకు అమ్మి లబ్ది పొందిన నెరస్తులను అరెస్ట్ చేసిన రూలర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విజయ్.

నేరస్తులు అయిన అబ్దుల్ రహమాన్ బసరవి నివాసము పాత పాలమూర్, షేక్ ఆషిం నివాసము రామయ్య బౌలీ, మహబూబ్ నగర్, బుజగవుని రాఘవేందర్ గౌడ్ నివాసము కోడూర్ గ్రామము, ఖాజా నసీరుద్దీన్ నివాసము హబీబ్ నగర్ వీరంతా పథకం కలిసి కోడూర్ గ్రామ శివారులో ఉన్న శ్రీమతి అమీన బసరవి నివాసము పాత పాలమూర్ గారి 7 ఏకరముల 11 గుంటల భూమిని సదరు అమీన గారి నలుగురు కుమారులు విదేశాలకు వెళ్ళినది చూసి, వారికి ఎవ్వరికీ తెలియయకుండా నేరస్తులు అందరూ కుమ్మక్కు అయి ఫేక్ లీగల్ హెయిర్ ప్రొసీడింగ్ తీయించి పిర్యాదురాలు దూరపు బందువు అయిన అబ్దుల్ రహమాన్ బసరవి అమీన వారసుడిగా చూపిస్తూ అబ్దుల్ రహమాన్ బసరవి ద్వారా మొత్తము పొలము షేక్ ఆషిం కు రిజిస్ట్రేషన్ చేసి, తదుపరి సదరు ఆషిం రాఘవేందర్ గౌడ్ కు కొంత, ఖాజా నసీరుద్దీన్ కు కొంత పొలము రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

శ్రీమతి అమీన బసరవి, 2024 లో కంప్లైంట్ ఇవ్వగా చీటింగ్ మరియు ఫాజిరీ క్రింద కేసు నమోదు చేసి, పరిశోదన ఆనంతరము నేరం రుజువు కావడంతో పై ముగ్గురు అయిన ఆషిం, రాఘవేందర్, ఖాజా నసీరుద్దీన్ ను అరెస్ట్ చేసి గౌరవ IV Addl. JFCM కోర్టు మహబూబ్ నగర్ ముందు హాజరు పర్చగా నెరస్తులను 14 రోజుల రిమాండ్ కు పంపనైనది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story