Nagarkurnool: అస్వస్థతకు గురైన ఉప సర్పంచ్ లింగమయ్య కుటుంబానికి ఆర్థిక సాయం

Nagarkurnool: వెల్దండ మండలం గుండాల గ్రామ ఉప సర్పంచ్ కొమ్ము లింగమయ్యకు బ్రెయిన్ స్ట్రోక్‌రావడంతో సర్పంచ్ అరుణ్ నాయక్, మల్లేష్ యాదవ్ ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Aug 2026 7:25 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: అస్వస్థతకు గురైన ఉప సర్పంచ్ లింగమయ్య కుటుంబానికి ఆర్థిక సాయం

నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ ఆగస్టు 11: వెల్దండ మండలం గుండాల గ్రామ ఉప సర్పంచ్ కొమ్ము లింగమయ్య ఇటీవల బ్రెయిన్ స్ట్రోక్ కు గురై కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న అల్లం తోట బావి తండా సర్పంచ్ రోజా అరుణ్ నాయక్ పరామర్శించి రూ. 10,000/-పది వేల రూపాయలు మరియు కే.యం ట్రేడర్స్ ప్రొపైటర్ మేడమోని మల్లేష్ యాదవ్ రూ.5,000/- ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేశారు.అనంతరం అతనికి అండగా ఉంటామని భరోసానిస్తూ అతని భార్య కవితకు ధైర్యం చెప్పారు.

వారితో పాటు గుండాల వార్డు సభ్యులు కొమ్ము రామకృష్ణ, బీజేపీ గ్రామ బూత్ అధ్యక్షులు భుజరాజు మల్లేష్, వెంకటయ్య,ఎనుముల మల్లేష్,వెంకటయ్య,మాధవులు,వినయ్ తదితరులు ఉన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story