Devarakadra: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఆల సవాల్!

Devarakadra: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఫైర్. అభివృద్ధిపై చర్చకు, కురుమూర్తి స్వామి సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమని సవాల్.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 24 April 2026 6:06 PM IST
Devarakadra
X

Devarakadra: ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ఆల సవాల్!

Devarakadra: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలను ఖండించిన మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రజలు అవకాశం మీకు ఇచ్చారని మొదట్లో మేము ఏం అనటం లేదని మా మీద అబద్ధాలు ప్రచారం చేయటం సరి కాదన్నారు.

నేను సివిల్ ఇంజినీర్ గా సొంతంగా ఆలోచించి కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నుండి లిఫ్ట్ అవసరం లేకుండా గ్రావిటీ కెనాల్ ద్వారా 11 గ్రామాలకు సాగునీరు అందించానని తెలిపారు.పెద్ద వాగు,ఊక చెట్టు వాగుల మీద 36 చెక్ డ్యాంల నిర్మాణం చేసి రైతుల సాగునీటి అవసరాలు తీర్చామని అన్నారు.

కరివెన రిజర్వాయర్ పాలమూరు ప్రాజెక్టు డిజైన్ లో లేకపోయినప్పటికీ సొంత ఆలోచనలతో అక్కడ రిజర్వాయర్ నిర్మాణం చేయొచ్చని కేసీఆర్ నీ ఒప్పించి 90 శాతం పనులు పూర్తి చేశామని అన్నారు.

దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అడ్వకేట్ కావడం వల్ల, ఆయన న్యాయవాద తెలివి అక్రమ కేసులు,సెక్షన్ లు, ఎఫ్ ఐ ఆర్,ఛార్జ్ షీట్ ఎలా ఫైల్ చేయాలో చెప్తున్నాడని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ అక్కడ స్థలం మార్చమని అడిగితే కేసు పెట్టి జైలులో వేయడమేంటని ప్రశ్నించాడు.

కురుమూర్తి స్వామి దగ్గరికి వెళ్దాం..ప్రమాణం చేద్దాం.. నల్లమట్టి అమ్ముకోలేదని నేను ప్రమాణం చేస్తాను.. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని నువ్వు కురుమూర్తి స్వామి దగ్గర బాండు పేపర్లు రాసి సంతకం పెట్టావ్. తీర్పు స్వామికి వదిలేద్దాం అని అన్నారు.

నీ పని తీరు మీద నమ్మకం ఉంటే రాజీనామా చేసి పోటీ చేయాలి.. నువ్వు గెలిస్తే నేను ఎమ్మెల్యే గా మళ్ళీ పోటీ చేయను అని సవాల్ విసిరారు. కరివెన ప్రాజెక్ట్ పెండింగ్ పనులు ఎందుకు చేయడం లేదని నిలదీశారు. డిసెంబర్ 9 వరకు టైమ్ ఇస్తున్నాను.. పద్ధతి మార్చుకోమని సూచించారు.

నిజాయితీగా రాజకీయల్లోకి వచ్చినం.. కాంట్రాక్టర్ గా వచ్చాను.. ఎమ్మెల్యే అయ్యాను.. నువ్వు అడ్వకేట్ గా వచ్చి ఎమ్మెల్యే అయిన తరువాత.. కాంట్రాక్టర్ అయ్యావ్.. ప్రతి మండలంలో జోరుగా అక్రమ ఇసుక దందా జరుగుతుంది..ప్రతి బండికి ఓ రేట్ కట్టి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్ లో నా ఆస్తుల వివరాలు ఉన్నాయి.

ఆస్తుల వివరాలు అఫిడవిట్ లోవి కాకుండా ఎక్కువ ఉంటే చెప్పు. ప్రజలకు ఇచ్చేస్తా.. అడ్వకేట్ వృత్తి చేసే కొల్లూరు లో వంద కోట్లు పెట్టీ కొన్నవా? ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందరికి వచ్చినట్టే దేవరకద్రకు వచ్చింది.. స్థలం మార్చమని అడిగితే పరిశీలిస్తా అని చెప్పకుండా. మొండిగా అక్కడే కడతా అంటున్నావ్. దేవరకద్రలో ఎక్కడికెళ్ళినా కేసీఆర్,నా ఆనవాళ్ళు ఉంటాయన్నారు.

మేము తెచ్చిన పనులకు మీ నేంబోర్డు లు పెట్టడం అలవాటు అయింది.. నాపై ఆరోపణలు మానుకోకపోతే మీ అక్రమాస్తుల చిట్టా నా వద్ద ఉంది అవి బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర మండల బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story