Devarkadra: తపోవన్ హైస్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
Devarkadra: దేవరకద్ర మండలంలోని డోకూరు తపోవన్ హైస్కూల్‌లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ విశిష్టతను వివరిస్తూ రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Devarkadra: తపోవన్ హైస్కూల్‌లో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు
దేవరకద్ర: దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామ సమీపంలో గల తపోవన్ హై స్కూల్ లో ఆర్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు.
చిన్నారి విద్యార్థిని ,విద్యార్థులచే ఒకరితో ఒకరికి రాఖీలు కట్టించి, రాఖి పండగ విశిష్టతను విద్యార్థిని విద్యార్థులకు ఆర్ఎస్ఎస్ సభ్యులు తెలియజేశారు.
మనమందరం ఒకరికి ఒకరు రక్షగా ఉంటూ మనందరం కలిసి దేశానికి రక్షగా ఉండాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వర్కుటి నిరంజన్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు చంద్రయ్య, నాగేశం నర్సింహులు , రవి,
ఇక్బాల్ పాష, తిరుపతయ్య, కురుమూర్తి, నాగరాజు, అనురాధ, ఉమ, సబీహా, పావని, అనిత, భవాని, స్వప్న, శిరీష, కరిష్మా, మౌనిక, లత, హేమలత, సరిత, జయంతి, స్వర్ణలత, మంజుల, నాగలక్ష్మి, విజయ శ్రీ, లిఖిత, అశ్విని, అభినయ పాల్గొన్నారు.




