Devarakadra: గూరకొండ ప్రభుత్వ బడిలో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం!

Devarakadra: గూరకొండ ప్రభుత్వ పాఠశాలలో ఏఐ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. త్వరలో విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 31 Aug 2026 3:31 PM IST
Devarakadra
X

Devarakadra: గూరకొండ ప్రభుత్వ బడిలో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభం!

Devarakadra: దేవరకద్ర మండలం గూరకొండ గ్రామంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పర్యటించారు.గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే.. ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం గూరకొండ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.

విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.ముఖ్యంగా వెనుకబడిన విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు.

ఏఐ ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధన అందించడంతో పాటు.. ఆధునిక విద్యా విధానాలను గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు తీసుకువస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.దేవరకద్ర మండలంలో ఇప్పటికే 6 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత కంప్యూటర్ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నామని తెలిపారు.రానున్న రోజుల్లో మరిన్ని పాఠశాలల్లో ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడంతో పాటు పేద కుటుంబాలకు సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో అరవింద్ కుమార్ రెడ్డి, అంజిల్ రెడ్డి, ఏ ఎమ్ ఓ దుంకుడు శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఎమ్మార్వో హర్షద్, సర్పంచ్ దాసరి చిన్నమ్మ హుసేనప్ప కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story