Devarakadra: 167వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే!

Devarakadra: రాహుల్ గాంధీ, ఖర్గే అరెస్టులకు నిరసనగా చిన్నచింతకుంట వద్ద 167 జాతీయ రహదారిపై దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ రాస్తారోకో.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 22 July 2026 3:12 PM IST
Devarakadra
X

Devarakadra: 167వ జాతీయ రహదారిపై రాస్తారోకో చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే!

Devarakadra: రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అరెస్టులకు నిరసనగా దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చిన్నచింతకుంట మండలం లాల్కోట చౌరస్తాలో 167వ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నివాసం ఎదుట ధర్నాకు దిగిన కాంగ్రెస్ ఎంపీల అరెస్టులను ఖండిస్తూ ఈ ఆందోళన చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. రాస్తారోకోతో జాతీయ రహదారిపై ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story