Achampet: చిన్నారుల భవిష్యత్తుకు ప్రీ ప్రైమరీ విద్యే బలమైన పునాది

Achampet: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేటలో ప్రీ ప్రైమరీ తరగతులను డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఆర్డీఓ రవీందర్ రెడ్డి ప్రారంభించారు.

VEERANNA, JUKKAL
Published on: 22 Jun 2026 5:18 PM IST
Achampet
X

Achampet: చిన్నారుల భవిష్యత్తుకు ప్రీ ప్రైమరీ విద్యే బలమైన పునాది

Achampet: అచ్చం పేట్ (కామారెడ్డి) కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రీ ప్రైమరీ విద్య చిన్నారుల భవిష్యత్తు కు బలమైన పునాది అని డి సి సి అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్ అన్నారు.సోమవారం నిజాంసాగర్ మండలం అచ్చం పేట్ గ్రామంలో బాన్సువాడ ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి తో కలిసి ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రీ ప్రైమరీ తరగతి గదులను సందర్శించి చిన్నారులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. అనంతరం నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమం లో ఆర్ డి ఓ స్థానిక అధికారులు పాల్గొని చిన్నారులకు పలకలపై అక్షరాలు దిద్ధించి వారి విద్యాభ్యాసానికి శ్రీకారం చుట్టారు. బాల్య విద్య చిన్నారుల భవిష్యత్తు కు బలమైన పునాది గా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.

పిల్లల జీవితంలో తొలి అడుగు అత్యంత కీలకమైందని ప్రీ ప్రైమరీ విద్య ద్వారా చిన్నారుల్లో విద్యపై ఆసక్తి, సృజనాత్మకత, విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయన్నారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని అన్నారు. ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నారులకు బాల్య దశ నుంచే నాణ్యమైన విద్య అందించడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చన్నారు.

ప్రభుత్వం విద్య రంగంలో చేపడుతున్న సంస్కరణలు గ్రామీణ ప్రాంత చిన్నారులకు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు కూడా నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని తెలిపారు.

అచ్చం పేట్ గ్రామంలో ప్రారంభమైన ఈ ప్రీ ప్రైమరీ తరగతులు గ్రామీణ ప్రాంత చిన్నారులకు నాణ్యమైన విద్యా ను మరింత చేరువ చేయడంతోపాటు వారి ఉజ్వల భవిష్యత్తు కు బలమైన పునాదిగా నిలుస్తాయని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమం లో తహసిల్దార్ సాయి భుజంగరావు, ఎంపి డి ఓ శివ కుమార్, ఎం ఈ ఓ తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రజా పండరి, అచ్చం పేట్ గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు,ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

VEERANNA, JUKKAL

VEERANNA, JUKKAL

Next Story