Vikarabad: ధారూరులో బీఆర్‌ఎస్ ధర్నా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
Vikarabad: ధారూరులో బీఆర్‌ఎస్ ధర్నా. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ డిమాండ్.
Vikarabad: ధారూరులో బీఆర్‌ఎస్ ధర్నా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
Vikarabad: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కొనసాగాలని డిమాండ్ చేస్తూ ధారూర్ మండలంలో నిర్వహించిన ధర్నాలో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “హైకోర్టులో పిటిషన్ వేయించి పథకాలను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. గత 10 సంవత్సరాలుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు ఇప్పుడు ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి?” అని ప్రశ్నించారు.
“రేవంత్ రెడ్డి వ్యక్తిగత కేసుల కోసం లక్షలు ఖర్చు చేసి లాయర్లను పెట్టుకుంటారు. మరి పేదల సంక్షేమ పథకాల కోసం ఎందుకు బలమైన న్యాయపోరాటం చేయడం లేదు?” అని నిలదీశారు.
“పథకాలను ఆపే ప్రయత్నాలు చేస్తే పేదల తరఫున బీఆర్ఎస్ పోరాడుతుంది. చేతనైతే వెంటనే కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించి పథకాలను కొనసాగించండి. చేతకాకపోతే బీఆర్ఎస్ లీగల్ టీంకు అప్పగించండి.. పథకాలు కొనసాగేలా మేము న్యాయపోరాటం చేస్తాం" అని డాక్టర్ మెతుకు ఆనంద్ స్పష్టం చేశారు.




