Amanagallu: ఆమనగల్లులో ఘనంగా కౌన్సిలర్ రమేష్ జన్మదిన వేడుకలు
Amanagallu: మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ రమేష్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరిపాయి. సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ పండ్లు పంపిణీ చేశారు.
Amanagallu: ఆమనగల్లులో ఘనంగా కౌన్సిలర్ రమేష్ జన్మదిన వేడుకలు
ఆమనగల్లు: కౌన్సిలర్ రమేష్‌కు గంప వెంకటేష్ అభినందనలు
రంగారెడ్డి జిల్లా
ఆమనగల్లు మున్సిపాలిటీ 8వ వార్డు కౌన్సిలర్ ఎనుమల్ల రమేష్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సింగిల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రమేష్‌కు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సింగిల్ విండో కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటి, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గంప వెంకటేష్ మాట్లాడుతూ రమేష్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. భవిష్యత్‌లో మరింత ఉత్సాహంతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పాపిశెట్టి రాము, దుడ్డు ఆంజనేయులు యాదవ్, నాగిళ్ల జగన్, పుల్లారెడ్డి అనూష శ్రీశైలం, ఎంగలి భాగ్యమ్మ రఘు, మాజీ కౌన్సిలర్ కమటం రాధమ్మ వెంకటయ్యతో పాటు నాయకులు సయ్యద్ ఖలీల్, అనంతుల సైదులు గౌడ్, పాండు, కొమ్ము ప్రసాద్, చలిచీమల సతీష్, జంతుక కిరణ్, అమృతం, జగదీష్, గుజ్జరి గోపి, పూసల భాస్కర్, లండం యాదయ్య, కాలే విక్రమ్, సైదులు, గణేష్, అంజి, జస్వంత్, వినయ్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




