Veldanda: కాంగ్రెస్ ‘420’ హామీలపై రచ్చ.. ప్రజావాణిలో ఫిర్యాదు!
Veldanda: కాంగ్రెస్ 420 హామీల అమలుపై వెల్దండ ప్రజావాణిలో బీఆర్ఎస్ ఫిర్యాదు. హామీలు అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారని డాక్టర్ విజితా రెడ్డి ఫైర్.
Veldanda: కాంగ్రెస్ ‘420’ హామీలపై రచ్చ.. ప్రజావాణిలో ఫిర్యాదు!
నాగర్ కర్నూలు జిల్లా: వెల్దండ మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆదేశాల మేరకు కల్వకుర్తి బీ ఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ డాక్టర్ విజిత రెడ్డి, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ 420 హామీలపై భగ్గుమన్న బిఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణిలో ఎంపీడీవో సులోచన కు 420 హామీలపై బిఆర్ ఎస్ శ్రేణులు వినతిపత్రం సమర్పించారు.
కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇంచార్జ్ మాజీ విజితా రెడ్డి, మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలపైబిఆర్ఎస్ కార్యకర్తలు కదం తొక్కా రు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ 2500, తులం బంగారం, అందించాలని అదేవిధంగా ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలని కోరారు.
రైతన్నలకు ప్రతి పంటకు రైతు భరోసా కింద ఎరువుల పంపిణి, రైతులకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్తు, రైతు కూలీలకు సంవత్సరానికి రూ 12000 సహాయం, ఇల్లు లేని ప్రతి నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
వృద్ధులకు వితంతువులకు 4 000 పెన్షన్ అందించాలి. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ 12,000 రూపాయలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అడుగుతే అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అదేవిధంగా అక్రమ కేసులు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అరుణ ప్రభాకర్, వెల్దండ మాజీ ఉపసర్పంచ్ జంగిలి నిరంజన్, మాజీ ఎంపీటీసీ లుజ్యోతి నిరంజన్, లింగం, వెల్దండ మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు కానుగుల జోగయ్య, మాజీ సర్పంచ్ శేఖర్, గండికోట రాజు, అంజి మాస్టర్, గ్రామ వార్డు సభ్యులు శేఖర్, జంగిలి ఆనంద్, పోలే అశోక్, జంగిలి ప్రవీణ్, గోక మల్ల రాజు, కుప్పగండ్ల బాలకృష్ణయ్య, జంగిలి రవి, పిల్లి శీను, తదితరులు పాల్గొన్నారు.




