Urukonda: ఊరుకొండలో ఎంజేఆర్ సొంత నిధులతో 2 బస్ షెల్టర్ల నిర్మాణానికి భూమిపూజ!

Urukonda: ఊరుకొండ మండల కేంద్రంలో ఎంజేఆర్ సొంత నిధులతో రెండు బస్ షెల్టర్ల నిర్మాణానికి భూమిపూజ.. హర్షం వ్యక్తం చేసిన స్థానికులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 9 Sept 2026 3:19 PM IST
Urukonda
X

Urukonda: ఊరుకొండలో ఎంజేఆర్ సొంత నిధులతో 2 బస్ షెల్టర్ల నిర్మాణానికి భూమిపూజ!

Urukonda: నాగర్ కర్నూల్ జిల్లా ప్రయాణికుల సౌకర్యార్థం ఊరుకొండ మండల కేంద్రంలో రెండు బస్‌షెల్టర్ల నిర్మాణానికి బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్ధన్ రెడ్డి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.

కోదాడ–రాయచూర్‌ 167వ జాతీయ రహదారిపై ఊరుకొండ స్టేజీకి ఇరువైపులా సుమారు 150 అడుగుల దూరంలో ఈ రెండు బస్‌షెల్టర్లను నిర్మించేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల సర్పంచ్ మ్యకల మంజుల శ్రీనివాసులుతో కలిసి ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి బుధవారం భూమిపూజ నిర్వహించారు. గ్రామ ప్రజలు, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని బస్‌షెల్టర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.

బస్‌షెల్టర్లు అందుబాటులోకి వస్తే ఎండ, వర్షం సమయంలో ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో భాగంగా సొంత నిధులతో బస్‌షెల్టర్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ముచ్చర్ల జనార్దన్‌రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, లక్ష్మణ్‌కుమార్ గౌడ్, కొమ్ము శ్రీను, సందీప్‌కుమార్, రామకృష్ణ, శ్రీశైలం, కొండం సురేష్, ఆంజనేయులు, కిట్టు, అరుణ్, కృష్ణయ్య, హరీష్, నవీన్, తేజ, మాధవులు, చంద్రయ్య, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story