Amanagallu: ఆమనగల్లులో ఘనంగా మున్సిపల్ చైర్మన్ నాయక్ జన్మదిన వేడుకలు
Amanagallu: ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ పత్య నాయక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొక్కలు నాటి, కేజీబీవీ విద్యార్థులతో కలిసి ఆయన వేడుకలు జరుపుకున్నారు.
Amanagallu: ఆమనగల్లులో ఘనంగా మున్సిపల్ చైర్మన్ నాయక్ జన్మదిన వేడుకలు
పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి
రంగారెడ్డి జిల్లా: ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని మున్సిపాలిటీ చైర్మన్ పత్య నాయక్ జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో చైర్మన్ పత్య నాయక్ పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు తనవంతు బాధ్యతగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని, పచ్చదనం పెంపొందించేందుకు ప్రజలు భాగస్వాములు కావాలని పత్య నాయక్ సూచించారు.
అనంతరం పట్టణ కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.
తదుపరి పట్టణ కేంద్రంలోని సంత్ సేవాలాల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చైర్మన్ పత్య నాయక్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శివలింగం,డైరెక్టర్ శ్రీశైలం,నాయకులు గాజుల శ్రీనివాస్, పుసలా సత్యం,అలీం, ఫరీద్,రఫీ, మహేష్, శ్రీకాంత్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.




