Charakonda: జెపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం
Charakonda: నాగర్ కర్నూలు జిల్లా జెపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. సర్పంచ్ అమీనా అశోక్ రాథోడ్ జాతీయ జెండా ఆవిష్కరణ.
Charakonda: జెపల్లి గ్రామ పంచాయతీలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం
Charakonda: నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జెపల్లి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి భావాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ అమీనా అశోక్ రాథోడ్ , ఉప సర్పంచ్ మధు , వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర కోసం తమ ప్రాణాలను సైతం త్యాగం చేసిన మహనీయుల సేవలను, త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఐక్యత, సమానత్వం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.ప్రతి ఒక్కరిలో దేశభక్తి, సామాజిక బాధ్యత పెంపొందించాలని, యువత దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.




