Pargi: పరిగిలో విషాదం గుండెపోటుతో 28 ఏళ్ల యువకుడు మృతి!

Pargi: వికారాబాద్ జిల్లా పరిగిలో తీవ్ర విషాదం. గుండెపోటుతో ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనే 28 ఏళ్ల నాగేష్ చారి మృతి.

WAZID, PARIGI
Published on: 23 Aug 2026 9:11 AM IST
Vikarabad
X

Vikarabad: పరిగిలో విషాదం గుండెపోటుతో 28 ఏళ్ల యువకుడు మృతి!

PARGI: వికారాబాద్ జిల్లా పరిగిలో విషాద ఘటన చోటుచేసుకుంది. మున్నూరువాడకు చెందిన 28 ఏళ్ల వడ్ల నాగేష్ చారి హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. చిన్న వయసులోనే యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఛాతీలో నొప్పిగా ఉందని తెలిసిన వారికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు.

అయితే ఫోన్ ఎవరూ ఎత్తకపోవడంతో నాగేష్ చారి స్వయంగా నడుచుకుంటూ పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన వెంటనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

వైద్యులు వెంటనే ఈసీజీ పరీక్ష నిర్వహించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. హార్ట్ ఎటాక్ కారణంగానే మృతి చెందినట్లు సమాచారం.

ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

చిన్న వయసులోనే నాగేష్ చారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో మున్నూరువాడలో విషాదఛాయలు అలుముకున్నాయి.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story