Tulsi Benefits: వృద్ధులను యువకులుగా మారుస్తున్న ఆకు... ఉదయాన్నే రెండు నమిలితే చాలు
Tulsi Benefits: శరీరంలోని చాలా రోగాలను ఈ ఆకు నయం చేస్తుంది. ఇంతకీ ఈ మొక్క పేరేంటో తెలుసా? తులసి మొక్క.
Tulsi Benefits: వృద్ధులను యువకులుగా మారుస్తున్న ఆకు... ఉదయాన్నే రెండు నమిలితే చాలు
Tulsi Benefits: ఎవరైతే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారో...వారికి వయసు పెరిగినా కూడా యువకుల మాదిరిగానే కనిపిస్తారు. ఇలా కనిపించడం కోసం లక్షలకు లక్షలు జిమ్‌లు, కాస్మోటిక్స్ కోసం ఖర్చు చేస్తుంటారు. ఇవేమి అవసరం లేకుండా ఇంటి పెరట్లో పెరిగే ఓ మొక్క ఆకులను రోజూ ఉదయాన్నే రెండు నమలడం వలన ఆరోగ్యం మెరుగౌతుంది. శరీరంలోని చాలా రోగాలను ఈ ఆకు నయం చేస్తుంది. ఇంతకీ ఈ మొక్క పేరేంటో తెలుసా? తులసి మొక్క. మనం ఇంట్లో దైవంగా భావించి రోజూ పూజించే తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. సరైన విధంగా దీనిని తీసుకుంటే శరీరానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది.
ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ
ఆయుర్వేదం ప్రకారం తులసి ఒక శక్తివంతమైన ఔషధ మొక్క. ఇందులో విటమిన్ సి, జింక్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ప్రతీరోజూ ఉదయం రెండు నుంచి 3 తులసి ఆకులను తీసుకోవడం వలన జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వాతావరణ మార్పుల సమయంలో తులసి కషాయం తాగితే ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. శ్వాసకోశ సమస్యల విషయంలో కూడా తులసి మంచి ఫలితాలు ఇస్తుంది. ఆస్తమా, బ్రోంకైటిస్, గొంతు నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. రోజుకు ఒకసారి ఇలా తీసుకుంటే కఫం తగ్గి శ్వాస సులభంగా ఉంటుంది.
ఒత్తిడి నుంచి ఉపశమనం
ఈరోజుల్లో ఒత్తిడి ప్రధాన సమస్యగా మారింది. ఈ సమస్యనుంచి బయటపడటం కోసం పలురకాలైన ట్రీట్‌మెంట్లు తీసుకుంటుంటారు. కానీ, తులసి ఆకులతో టీ తయారు చేసుకొని తాగడ వలన ఒత్తిడి తగ్గుతుంది. ఇందులో ఉండే అడాప్టోజెన్ గుణాలు మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. నిద్రలేమి సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు, చర్మ ఆరోగ్యానికి కూడా తులసి ఉపయోగకరం. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మొటిమలు, చర్మ అలర్జీలను తగ్గిస్తాయి. తులసి ఆకులను పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మం శుభ్రంగా, కాంతివంతంగా మారుతుంది. వారం లో 2 నుంచి 3 సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కూడా తులసి కీలక పాత్ర పోషిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడేవారు తులసి ఆకులు నమలడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అలాగే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించి కిడ్నీ రాళ్లు ఏర్పడకుండా సహాయపడుతుంది.
జాగ్రత్తలు
అతి సర్వత్రా వర్జయేత్ అంటాం. దేనిని కూడా ఎక్కువగా చేయకూడదు. రోజూ 2 నుంచి 3 ఆకులు మాత్రమే తీసుకోవాలి. అంతకు మించి తులసి ఆకులను తీసుకుంటే శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం తులసి ఆకులను నేరుగా నమలడం కంటే కూడా టి లేదా కషాయం రూపంలో తీసుకోవడం మంచిదని అంటున్నారు. ఖర్చు లేకుండా ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, వృద్ధాప్య ఛాయలను కూడా దూరం చేసే తులసిని జాగ్రత్తగా చూసుకుందాం. రోజూ నీళ్లుపోసి దీపం వెలిగించడం వలన భక్తి పెరుగుతుంది. ఆకులను తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.




