ఏసీ, కూలర్ పక్కన పడేయండి.. రూ. 30 లతో ఇంట్లో మంచు కురవాల్సిందే.. ఓసారి ట్రై చేయండి..!

Summer Cooling Hacks: సాంకేతికత పెరిగేకొద్దీ మనం ప్రకృతికి దూరమవుతున్నాం.

Venkat
Updated on: 16 May 2026 10:49 AM IST
Summer Cooling Hacks
X

ఏసీ, కూలర్ పక్కన పడేయండి.. రూ. 30 లతో ఇంట్లో మంచు కురవాల్సిందే.. ఓసారి ట్రై చేయండి..!

Summer Cooling Hacks: వేసవి కాలంలో భానుడి భగభగలకు ఇళ్లు నిప్పుల కొలిమిలా మారుతుంటాయి. ఈ ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది ఏసీలు, కూలర్లపై ఆధారపడుతుంటారు. అయితే, వీటి వల్ల కరెంట్ బిల్లులు తడిసి మోపెడవుతుంటాయి. రూపాయి ఖర్చు లేకుండా, మన ఇంట్లో సహజసిద్ధంగా లభించే ఒక సాధారణ వస్తువుతో ఇల్లంతా ఏసీలా మార్చుకోవచ్చనే చిట్కా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం ఒక ఎండిన కొబ్బరి చిప్పను ఉపయోగించి వేసవి తాపాన్ని ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

కొబ్బరి చిప్పతో చల్లదనం: అసలు చిట్కా ఏంటి?

ఈ వినూత్న ఇంటి చిట్కా కోసం మనకు పెద్దగా వస్తువులు అవసరం లేదు. కేవలం ఒక ఖాళీ కొబ్బరి చిప్ప, కొద్దిగా నీరు ఉంటే సరిపోతుంది. కొబ్బరి పీచు లేదా చిప్పకు సహజంగానే తేమను నిలిపి ఉంచే, వేడిని గ్రహించే గుణం ఉంటుంది. ఈ గుణాన్నే మనం ఇక్కడ చల్లదనం కోసం వాడుకోబోతున్నాం.

పని చేసే విధానం..

మొదటగా ఒక ఎండిన కొబ్బరి చిప్పను తీసుకొని దానిని కొద్దిసేపు చల్లని నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత అందులో నీటిని పోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. కొబ్బరి చిప్పలో నీళ్లు గడ్డలా కట్టే వరకు ఉంచాలి. ఆ తర్వాత గిన్నె తీసుకొని అందులో చల్లని నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఆ గిన్నెపైన కాటన్ క్లాత్ ఉండాలి. ఈ కాటన్ క్లాత్ పైన గడ్డ కట్టిన కొబ్బరి చిప్పను ఉంచాలి. దీనిని బెడ్ రూంలోని ఫ్యాన్ కింద ఉంచితే నాచురల్ ఏసీ రెడీ అయినట్లే. చిప్పలోని తేమ కారణంగా ఫ్యాన్ నుంచి వచ్చే సాధారణ గాలి కాస్తా చల్లని పొగమంచు లాంటి గాలులుగా మారి గది ఉష్ణోగ్రతను అద్భుతంగా తగ్గిస్తుంది.

కూలర్ల కంటే ఇది ఎలా మేలు?

సాధారణ కూలర్లలో వాడే గడ్డి లేదా ప్యాడ్‌ల వల్ల కొన్నిసార్లు దుర్వాసన రావడం, బ్యాక్టీరియా చేరడం వంటి సమస్యలు ఉంటాయి. కానీ కొబ్బరి చిప్ప పూర్తిగా సహజమైనది కావడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. పైగా కూలర్ కొనే ఖర్చు, దానిని నిర్వహించే శ్రమ తప్పుతాయి. రాత్రి పూట పడుకునే ముందు ఈ చిన్న అమరికను చేసుకుంటే ఎలాంటి ఉక్కపోత లేకుండా ప్రశాంతమైన నిద్ర మీ సొంతమవుతుంది.


Venkat

Venkat

2013లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌, పలు పత్రికల్లో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాస్తుంటాను. స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాస్తుంటాను.

Next Story