Summer:ఎండాకాలంలో ఉప్పు,చక్కెర నీళ్ల ద్రావణాన్ని ఎందుకు తాగాలో మీకు తెలుసా?
Meta Description: తీవ్రమైన ఎండల్లో శరీరంలో నీరు లవణాలు తగ్గకుండా ఉండేందుకు ఉప్పు చక్కెర నీటి ద్రావణం ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు
Summer
Summer Health Tips: గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఎండలు మరింత మండుతున్నాయి.తీవ్రమైన ఎండల కారణంగా విపరీతమైన వేడి, చెమట చిరాకు తెప్పిస్తున్నాయి.శరీరానికి అధికంగా చెమటలు పట్టడం వల్ల లోపల నుంచి నీరు మాత్రమే కాకుండా లవణాలు కూడా బయటకు పోతాయి. దీంతో శరీరంలోని నీటి స్థాయిలు కాపాడుకోవడానికి,నిర్జలీకరణాన్ని నివారించడానికి ఇప్పుడు మనం చెప్పుకునే పరిష్కారం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఉప్పు,చక్కెర నీళ్ల ద్రావణం..
ఉప్పు, చక్కెర,నీళ్ల ద్రావణం శరీరంలోని నీటి స్థాయిలను కాపాడుతుంది. అలాగే శరీరాన్ని నిర్జలీకరణం కాకుండా ఉంచుతుంది.మన శరీరంలోని కణాలు,నరాలు సరిగ్గా పనిచేయడానికి సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లుఎంతగానో అవసరంఅనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ ద్రావణంలోని సోడియం ద్రవాలను నిలుపుకోవడానికి, రక్తపోటును నియంత్రించడానికి మంచి సహాయకారి.
మండే ఎండలో మనకి తరచు నీరసంగా, నిస్సత్తువగా ఉన్నట్లు ఉంటుంది. చక్కెర రక్తంలో కలిసినప్పుడు, అది శరీరానికి తక్షణ శక్తిని అందించి, అలసటను తగ్గించి, తల తిరగడాన్ని నివారిస్తుంది.శరీర ఉష్ణోగ్రత పెరిగి, నిర్జలీకరణం ఏర్పడినప్పుడు, వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది.
ఈ ద్రావణం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది.అత్యధిక వేడి తరచుగా లో బీపీకి కారణమై, స్పృహ కోల్పోయేలా చేస్తుంది. ఈ ద్రావణంలోని ఉప్పు రక్త పరిమాణాన్ని పెంచడం ద్వారా సాధారణ రక్తపోటును నిర్వహించడానికి సహాయపడుతుంది.




