మగవారిలో ఈ లక్షణాలు ఉంటే చాలు.. అమ్మాయిలు క్యూ కడతారట!

మహిళలకు మగవారిలో ఏ విషయాలు ఎక్కువగా నచ్చుతాయి? కేవలం అందం, ఆస్తి లేదా ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే అని భావిస్తే పొరపాటే.

Ravi
By Ravi
Published on: 16 July 2026 7:19 PM IST
Male qualities women like
X

మగవారిలో ఈ లక్షణాలు ఉంటే చాలు.. అమ్మాయిలు క్యూ కడతారట!

Male qualities women like: మన సమాజంలో సాధారణంగా ఒక భావన ఉంది. మగవారికి మంచి అందం, కోట్లలో ఆస్తిపాస్తులు, లేదా ఒక హోదా ఉన్న ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు మహిళలు త్వరగా ఆకర్షితులవుతారని చాలామంది భావిస్తుంటారు. అయితే, జీవిత భాగస్వామిని ఎంచుకునే క్రమంలో మహిళలు కేవలం ఈ అంశాలను మాత్రమే చూడరు. వారి మనస్తత్వం, వ్యక్తిత్వం, మానసిక ఆలోచనా విధానానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయంపై ప్రముఖ డేటింగ్ కోచ్ జేమీ మాట్లాడే వరకు చాలామందికి అసలు విషయాలు తెలియలేదు. కేవలం డబ్బు, ఆస్తులు మాత్రమే కాకుండా పురుషులలో ఉండే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను ఆడవాళ్లు ఎంతగానో ఇష్టపడతారని ఆమె వివరించారు.

డేటింగ్ కోచ్ జేమీ విశ్లేషణ ప్రకారం, పురుషుల్లో ప్రధానంగా మూడు విషయాలను ఆడవాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. అందులో మొదటిది 'అహం లేని ఆత్మవిశ్వాసం'. మగాడిలో ఆత్మవిశ్వాసం ఉండాలి కానీ అది అహంకారంగా మారకూడదు. తనపై తనకు నమ్మకం ఉంటూనే ఎదుటివారికి గౌరవం ఇచ్చేతత్వం ఆడవాళ్లకు ఎంతో బాగా నచ్చుతుంది. రెండవది 'సెన్స్ ఆఫ్ హ్యూమర్'. తీయని మాటలతో, సమయానుకూలంగా ప్రశాంతంగా నవ్వించగలిగే చమత్కారం ఉన్న పురుషులతో గడపడానికి మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. మూడవది 'లక్ష్యం.. అదే ఆశయం'. జీవితంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగే వారిని మహిళలు బంగారంతో సమానంగా భావిస్తారు.

దీనికి తోడు, భావోద్వేగాల నిర్వహణ కూడా ఎంతో ముఖ్యం. గొడవలు జరిగినప్పుడు లేదా క్లిష్ట పరిస్థితుల్లో కోపంతో అరవకుండా, ఎంతో ప్రశాంతంగా, నిశ్శబ్దంగా తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే మగవారి వైపు మహిళలు త్వరగా ఆకర్షితులవుతారు. అలాగే ఎప్పటికప్పుడు జీవితంలో ఒక మంచి ఆశయంతో, భవిష్యత్తు కోసం కష్టపడుతూ ముందుకు సాగే పురుషులను చూస్తే మహిళలకు ఒక రకమైన భద్రతా భావం, గౌరవం ఏర్పడతాయని జేమీ వివరించారు.

కాగా, మహిళల మనసు గెలుచుకోవడానికి కేవలం అద్దంలో కనిపించే అందం, బ్యాంకులో ఉండే ఆస్తిపాస్తులు మాత్రమే సరిపోవు. మీ నడవడిక, నిజాయితీ, ఇతరులతో మీరు వ్యవహరించే తీరే మిమ్మల్ని ఒక ఉత్తమమైన వ్యక్తిగా నిలబెడుతుంది. పురుషులు తమ వ్యక్తిత్వాన్ని, ఆలోచనా విధానాన్ని మెరుగుపరుచుకోవడం ద్వారా ఎవరికైనా ఇష్టమైన భాగస్వామిగా మారవచ్చునని చెప్పుకొచ్చింది.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story