Interlocking Bricks House Construction: తక్కువ ఖర్చుతో ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటే.... ఇదే బెస్ట్‌ ఐడియా

Interlocking Bricks House Construction: ఎంత కష్టమైనా సరే సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.

Balachander
Published on: 10 April 2026 12:04 PM IST
Interlocking Bricks House Construction
X

Interlocking Bricks House Construction

Interlocking Bricks House Construction: ఎంత కష్టమైనా సరే సొంత ఇల్లు కట్టుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ, నేటి కాలంలో సిమెంట్‌, ఇసుక ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఇల్లు కట్టుకోవడం సామాన్యులకు భారంగా మారింది. సాంకేతికత అందుబాటులోకి వచ్చాక దీనిని ఉపయోగించి సరికొత్త ఇటుకలను తయారు చేస్తున్నారు. అవే ఇంటర్‌ లాక్‌ ఇటుకలు. ఈ ఇటుకలను వినియోగించుకొని వేగంగా, అందమైన ఇంటిని నిర్మించుకోవచ్చు. సిమెంట్‌ వినియోగం తగ్గడంతో ఖర్చుకూడా తగ్గిపోతుంది.

ఇంటర్‌లాక్‌ ఇటుకలు

ఇంటర్‌లాక్ ఇటుకలు ప్రత్యేక ఆకృతిలో తయారవుతాయి. ఒక ఇటుక మరొక ఇటుకలో సరిగ్గా సరిపోయేలా లాక్ అవుతుంది. అందుకే గోడలు కట్టేటప్పుడు మధ్యలో సిమెంట్ మిశ్రమం ఎక్కువగా అవసరం ఉండదు. సాధారణంగా పునాది, పిల్లర్లు, బీమ్‌ల దగ్గర మాత్రమే సిమెంట్ వాడితే సరిపోతుంది. దీంతో మొత్తం నిర్మాణ వ్యయంలో సిమెంట్ ఖర్చు 20% నుంచి 30% వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలా ఇంటర్‌లాక్‌ ఇటుకలతో కట్టిన ఇంటికి ప్లాస్టరింగ్‌ అవసరం కూడా ఉండదు. ఇటుకలు మంచి ఫినిషింగ్‌తో ఉండటం వలన వీటితో నిర్మించిన గోడలకు నేరుగా పెయింటింగ్‌ వేసుకోవచ్చు. ప్లాస్టరింగ్‌ ఖర్చు భారీగా తగ్గుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది.

దృఢమైన మన్నిక

ఇలాంటి ఇటుకలతో కట్టిన ఇల్లు వర్షం, ఎండ వంటి వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఉంటాయి. అంతేకాదు, వేసవిలో నిర్మించిన ఇల్లు చాలా చల్లగా ఉంటుంది. ఈ ఇటుకల తయారీలో హై ప్రెషర్‌ కంప్రెషన్‌ పద్దతిని వినియోగించి తయారు చేస్తారు. దీంతో ఇటుకలను సాధారణ వాటిలా కాల్చడం ఉండదు. దీంతో వీటిని కాలుష్యరహిత ఇటుకలుగా పిలుస్తున్నారు. పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఇంటిని నిర్మించే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ఇటుకలతో నిర్మాణం కొంచెం భిన్నంగా ఉంటుంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ విధమైన ఇటుకలతో ఇంటిని నిర్మించగలుగుతారు. ఇటుకలను కొనుగోలు చేసే సమయంలోనే జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయాలి.

మొత్తంగా చూసుకుంటే, పర్యావరణ హితంగా, తక్కువ ఖర్చుతో గట్టి ఇల్లు కావాలనుకునే వారికి ఈ మోడల్‌ నిజమైన బెస్ట్‌ ఐడియా అని చెప్పొచ్చు. కాలుష్యం లేని, చల్లని ఇంటిని నిర్మించాలని అనుకునేవారు ఈ ఇంటర్‌లాక్‌ ఇటుకల వైపు మొగ్గుచూపుతున్నారు. భవిష్యత్తులో ఈ విధానం మరింత ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story