Lifestyle: మీక్కూడా హీల్స్ వేసుకునే అలవాటు ఉందా.? ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు

Lifestyle: ప్ర‌స్తుతం హై హీల్స్ వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఎక్కువసేపు హీల్స్ ధరించడం అస్స‌లు మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మోకాళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Mokshith
Published on: 3 April 2026 2:42 PM IST
Lifestyle
X

Lifestyle: మీక్కూడా హీల్స్ వేసుకునే అలవాటు ఉందా.? ఈ స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు 

Lifestyle: ప్ర‌స్తుతం హై హీల్స్ వేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఎక్కువసేపు హీల్స్ ధరించడం అస్స‌లు మంచిది కాద‌ని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మోకాళ్లపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హీల్స్ వల్ల శరీర సమతుల్యతలో మార్పు

ఆర్థోపెడిక్ నిపుణుల ప్రకారం సమస్య హీల్స్‌ని ఎక్కువ‌సేపు ధరించడం వల్ల వస్తుంది. హీల్స్ వేసుకున్నప్పుడు శరీర సమతుల్యత మారుతుంది. నడిచే విధానం కూడా సాధారణంగా ఉండదు. ఈ మార్పు కారణంగా శరీర బరువు మోకాళ్లపై భిన్నంగా పడుతుంది. ముఖ్యంగా మోకాలి ముందు భాగంపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. దీని వల్ల లిగ్‌మెంట్లు, మసిల్స్‌పై అదనపు ఒత్తిడి ఏర్పడి నొప్పి లేదా గట్టిపడటం వంటి సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది.

ఎక్కువ సమయం వరుసగా హీల్స్ ధరించడం వ‌ల్ల మొదట్లో మోకాళ్ల‌లో స్వల్ప నొప్పి, అసౌకర్యం మాత్రమే కనిపించినా, తర్వాత ఇది పెద్ద సమస్యగా మారవచ్చు. నిపుణుల మాటల్లో చెప్పాలంటే, మోకాలి జాయింట్‌లో ఉండే కార్టిలేజ్‌పై నిరంతరం ఒత్తిడి పడితే అది క్రమంగా దెబ్బతింటుంది. దీని వల్ల భవిష్యత్తులో ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?

మసిల్స్ బలహీనంగా ఉన్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఇప్పటికే జాయింట్ సమస్యలు ఉన్నవారిలో ఈ స‌మ‌స్య వ‌చ్చే అవ‌కాశాలు మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. ఇలాంటి వారు హీల్స్ ధరించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మోకాళ్లపై ఒత్తిడి త్వరగా పెరిగి సమస్యలు తీవ్రమవుతాయి.

హీల్స్ ధరించేటప్పుడు పాటించాల్సిన సూచనలు

నిపుణుల ప్రకారం హీల్స్ పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ వాటిని సరైన విధంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. 2 నుంచి 3 ఇంచులకంటే ఎక్కువ ఎత్తు ఉన్న హీల్స్ ఎక్కువగా ఉపయోగించకూడదు. బ్లాక్ హీల్స్ లేదా వెజెస్ వంటి డిజైన్లు కొంతవరకు సురక్షితం. వరుసగా 2 నుంచి 4 గంటలకంటే ఎక్కువసేపు హీల్స్ ధరించకూడదు. మధ్య మధ్యలో సౌకర్యవంతమైన షూస్ వేసుకోవాలి. హీల్స్ తీసిన తర్వాత పాదాలకు స్ట్రెచింగ్ చేయాలి. ఈ సూచనలు పాటిస్తే మోకాళ్లపై పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. సరైన జాగ్రత్తలు లేకుండా ఎక్కువసేపు హీల్స్ ధరించడం భవిష్యత్తులో మోకాళ్ల ఆరోగ్యానికి ప్రమాదంగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story