Kidney Health Tips: మీరు తెలిసి మరీ చేసే ఈ తప్పులు మీ కిడ్నీలను పాడు చేస్తాయి.
Kidney Health Tips: ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మన రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న అలవాట్లు కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి.
Kidney Health Tips: మీరు తెలిసి మరీ చేసే ఈ తప్పులు మీ కిడ్నీలను పాడు చేస్తాయి.
Kidney Health Tips: ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారత్, చైనా వంటి దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మన రోజువారీ జీవితంలో చేసే కొన్ని చిన్న అలవాట్లు కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి. ఇప్పుడు కిడ్నీలకు హాని చేసే 5 ముఖ్యమైన అలవాట్లు ఏమిటో తెలుసుకుందాం.
ఎక్కువ ఉప్పు తినడం
అధికంగా ఉప్పు తీసుకోవడం కిడ్నీలకు ప్రమాదకరం. ఎక్కువ ఉప్పు వల్ల శరీరంలో నీరు నిల్వ అవుతుంది. దీని వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక రక్తపోటు కిడ్నీలలో ఉన్న చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలంలో ఇది కిడ్నీ పనితీరును తగ్గించవచ్చు.
తరచుగా పెన్‌కిల్లర్ మందులు వాడటం
నొప్పి తగ్గించుకునేందుకు చాలా మంది తరచుగా పెన్ కిల్లర్ మందులు తీసుకుంటుంటారు. ముఖ్యంగా NSAIDs అనే మందులు ఎక్కువగా వాడితే కిడ్నీలకు హాని కలిగించవచ్చు. ఈ మందులు కిడ్నీలకు వెళ్లే రక్తప్రవాహాన్ని తగ్గిస్తాయి. దీర్ఘకాలం ఇలా కొనసాగితే కిడ్నీలు నెమ్మదిగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
తక్కువగా నీరు తాగడం
రోజంతా సరిపడా నీరు తాగకపోవడం కూడా కిడ్నీలకు హానికరం. నీరు తక్కువగా తాగితే శరీరంలో విషపదార్థాలు (టాక్సిన్లు) నిల్వ అవుతాయి. దీంతో కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అలాగే కిడ్నీ స్టోన్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ అవుతుంది. అందుకే రోజూ తగినంత నీరు తాగడం చాలా అవసరం.
ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం
ప్యాకెట్ స్నాక్స్, జంక్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్ వంటి ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం కూడా కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. వీటిలో అధికంగా సోడియం, రసాయన పదార్థాలు ఉంటాయి. ఇవి కిడ్నీల పనితీరును దెబ్బతీయవచ్చు. అందుకే వీటి వినియోగాన్ని తగ్గించడం మంచిది.
సరిపడా నిద్ర లేకపోవడం
నిద్ర మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. తరచూ తక్కువ నిద్రపోవడం వల్ల శరీరంలోని సమతౌల్యం దెబ్బతింటుంది. దీని ప్రభావం కిడ్నీలపై కూడా పడుతుంది. దీర్ఘకాలంగా నిద్రలేమి ఉంటే కిడ్నీ ఆరోగ్యం క్రమంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది.
కిడ్నీలను కాపాడుకోవాలంటే
కిడ్నీ సమస్యలను నివారించాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి చాలా అవసరం. తక్కువ ఉప్పు తీసుకోవడం, తగినంత నీరు తాగడం, జంక్ ఫుడ్ తగ్గించడం, అవసరం లేకుండా మందులు వాడకపోవడం, సరిపడా నిద్రపోవడం. వంటి ఈ చిన్న మార్పులు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో సహాయపడతాయి.
గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలే పాటించాలి.




