Fish: మీరు మార్కెట్‌లో కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో.. లేదో.. ఈ చిట్కాతో తెలుసుకోండి.!
Fish: మార్కెట్‌కు వెళ్లినప్పుడు తాజా చేపలను ఎలా గుర్తించాలో తెలియక చాలామంది తికమకపడుతుంటారు.
Fish: మీరు మార్కెట్‌లో కొనే చేపలు ఫ్రెష్‌గా ఉన్నాయో.. లేదో.. ఈ చిట్కాతో తెలుసుకోండి.!
Fish: ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహారుల ఇళ్లలో ముక్క లేనిదే ముద్ద దిగదు. ముఖ్యంగా చేపల ప్రియులు మార్కెట్‌కు వెళ్లి రకరకాల చేపలను కొనుగోలు చేస్తుంటారు. అయితే, మార్కెట్లో దొరికే అన్ని చేపలు తాజావి కాకపోవచ్చు. ఐస్ వేసి రోజులు తరబడి నిల్వ ఉంచిన చేపలను కొని తింటే ఆరోగ్యానికి ముప్పే. మరి మార్కెట్‌లో అసలైన తాజా చేపలను గుర్తించడం ఎలాగో ఈ చిట్కాలతో ఇప్పుడు తెలుసుకుందాం.
తాజా చేపలను గుర్తించడానికి 5 సులభమైన చిట్కాలు:
నొక్కి చూడాలి:
చేపలను కొనే ముందు వాటిపై వేలితో కొద్దిగా నొక్కి చూడాలి. ఒకవేళ అది మెత్తగా ఉంటే అది అస్సలు తాజాది కాదు. ఫ్రెష్ చేపలు ఎప్పుడూ తాకినప్పుడు గట్టిగా ఉంటాయి. అలాగే వాటి తోక భాగం మెరుస్తూ ఉంటుంది.
మొప్పల రంగు:
చేపల మొప్పలను తెరిచి చూడటం చాలా ముఖ్యం. మొప్పల రంగు ఎర్రగా లేదా గులాబీ రంగులో ఉంటే అది ఖచ్చితంగా తాజా చేపే. ఒకవేళ అవి గోధుమ రంగులోకి మారితే అది నిల్వ ఉంచిన పాడైపోయిన చేప అని గుర్తించాలి.
కళ్ల స్థితి:
చేపల కళ్లను నిశితంగా గమనించాలి. కనుగుడ్డు లోపలికి వెళ్లినా, లేదా కళ్లపై తెల్లటి పొర ఏర్పడినా అవి మంచి చేపలు కావు. తాజా చేపల కళ్లు ప్రకాశవంతంగా, స్పష్టంగా ఉంటాయి.
తీవ్రమైన వాసన:
సాధారణంగా చేపలకు ఒక రకమైన సముద్రపు లేదా నీటి వాసన ఉంటుంది. కానీ, చేపల నుండి విపరీతమైన, కుళ్లిన దుర్వాసన వస్తే మాత్రం వాటిని అస్సలు కొనకపోవడమే బెటర్.
మెరుపు:
తాజా చేపల శరీరంపై ఉండే పొలుసులు, చర్మం సహజంగానే కాంతివంతంగా మెరుస్తూ ఉంటాయి. నిల్వ ఉన్న చేపలు కాంతివిహీనంగా మారుతాయి. మార్కెట్‌కు వెళ్లినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే, మీరు ఎప్పుడూ తాజా, ఆరోగ్యకరమైన చేపలనే కొనుగోలు చేయవచ్చు.




