Health: ఈ ఆకు టీని కానీ రోజూ తీసుకున్నారంటే..దెబ్బకి ఆ సమస్య పరార్‌!

Health: జామ ఆకు టీ రోజూ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్ మలబద్ధకం తగ్గుతాయి. ఇది బరువు మధుమేహం గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

Ramya Thota
Published on: 25 April 2026 4:09 PM IST
Health
X

Health

Guava Leaf Tea: జామ చెట్టు ప్రతి ఇంట్లో కనిపించే మొక్కే.దాని ఔషధ గుణాలు గురించి నేటికాలంలో చాలామందికి తెలిసే ఉంటుంది.జామ చెట్టు కాండం నుంచి కాయ వరకు ప్రతిది మనిషికి ఉపయోగపడేదే.ప్రస్తుత రోజుల్లో జామ ఆకులను ఎన్నో రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తున్నారు.

నేటి ఉరుకుల పరుగుల జీవితం, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సమస్యలు చాలా మామూలుగా అయిపోయాయి. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతుంటారు.అలాంటి వారికి జామ ఆకు టీ ఓ సంజీవనిగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు.

జామ ఆకులలో యాంటీ-బ్యాక్టీరియల్, యాంటీ-మైక్రోబియల్, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. వాటిలో ఉండే ఫైబర్, విటమిన్ సి వంటివి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. కాబట్టి, జామ ఆకు టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1. మలబద్ధకం నుండి ఉపశమనం

జామ ఆకు టీ సహజ విరేచనకారిగా పనిచేస్తుంది. ఇది ప్రేగులను శుభ్రపరచడానికి సహాయపడుతుంది, తద్వారా దీర్ఘకాలిక మలబద్ధకం నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

2. గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది:

కడుపులో గ్యాస్‌కు ప్రధాన కారణం జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడమే. జామ ఆకులలోని ఎంజైమ్‌లు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని పెంచుతాయి, దీనివల్ల ఆహారం సులభంగా జీర్ణం కావడంతో పాటు ఉబ్బరాన్ని కూడా నివారిస్తుంది.

3. బరువు తగ్గడంలో

జామ ఆకు టీ పిండిపదార్థం చక్కెరగా మారకుండా నిరోధిస్తుంది, దీనివల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నివారించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

4. మధుమేహాన్ని నియంత్రించడంలో

అనేక పరిశోధనల ప్రకారం, జామ ఆకు టీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది.

5. గుండె ఆరోగ్యానికి:

ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

6. చర్మం- జుట్టు:

దీనిలోని యాంటీ-ఆక్సిడెంట్లు ముఖంపై మొటిమలను తొలగిస్తాయి.జుట్టు రాలడం సమస్యను కూడా తగ్గిస్తాయి.

జామ ఆకు టీ తయారు చేసే విధానం:

ముందుగా, జామ ఆకులను శుభ్రమైన నీటితో బాగా కడగాలి. తరువాత, ఒక పాత్రలో 2 కప్పుల నీటిని మరిగించాలి. మరుగుతున్న నీటిలో ఆకులను వేసి, నీరు సగానికి తగ్గే వరకు మరిగించాలి. ఆ తరువాత, మంట ఆపివేసి, టీని వడకట్టండి. రుచికి తగినట్లుగా కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కలుపుకోవచ్చు.

దీన్ని ఎప్పుడు, ఎలా త్రాగాలి?

గ్యాస్, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడానికి, ఈ టీని ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం అత్యంత ప్రయోజనకరంగా వైద్యులు చెబుతుంటారు.

Ramya Thota

Ramya Thota

రమ్య జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు.

Next Story