Curry Leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Curry Leaves: వంటల్లో రుచి కోసం, సువాసన కోసం వాడే కరివేపాకును చాలామంది కూరల్లోంచి తీసి పక్కన పడేస్తుంటారు. కానీ కరివేపాకే కదా అని తీసిపడేస్తే..
Curry Leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి.. లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Curry Leaves: మన ఇళ్లలో ప్రతిరోజూ చేసే వంటల్లో పోపు కోసం కరివేపాకును తప్పనిసరిగా వాడుతుంటారు. అయితే, అన్నం తినేటప్పుడు చాలామంది ఆ కరివేపాకును తీసి కంచం పక్కన పడేస్తుంటారు. కానీ కరివేపాకే కదా అని తేలిగ్గా తీసి పడేస్తున్నారా? వంటల్లో రోజూ ఉపయోగించే కరివేపాకు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వైద్య నిపుణుల ప్రకారం.. కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ సీ, ఫైబర్ లాంటి శరీరానికి కావలసిన అత్యవసర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కరివేపాకును ఆహారంతో పాటు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఇందులో ఉండే విటమిన్ సీ, ఇతర పోషకాల కారణంగా శరీరంలో రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది.
కరివేపాకు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇవన్నీ మాత్రమే కాకుండా, రక్తంలో షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ అవుతాయని వైద్యులు వివరిస్తున్నారు. ఎన్నో లాభాలున్న ఈ ఆకులను అందుకే కూరల్లో పక్కన పడేయకుండా కచ్చితంగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.




