Health Tips: రాత్రిపూట ఎలాంటి ఆహారం తినాలి? నిద్ర పట్టాలంటే ఈ డైట్ చిట్కాలు పాటించాల్సిందే..
ప్రశాంతంగా నిద్రపోవాలంటే రాత్రిపూట తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఏ రకమైన ఆహారం తీసుకోవాలో, ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి.
Health Tips: రాత్రిపూట ఎలాంటి ఆహారం తినాలి? నిద్ర పట్టాలంటే ఈ డైట్ చిట్కాలు పాటించాల్సిందే..
Health Tips: ప్రస్తుత బిజీ లైఫ్స్టైల్లో చాలా మంది రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం, నూనె పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం చేస్తుంటారు. దీనివల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడి సరిగ్గా నిద్ర పట్టకపోవడం, ఉదయానికి నీరసంగా ఉండటం వంటి సమస్యలు తలెత్తుతాయి. హాయిగా నిద్రపోవాలంటే రాత్రిపూట ఎప్పుడూ తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు గట్టిగా చెబుతున్నారు. రాత్రి భోజనంలో జొన్నలు, సజ్జలు లేదా రాగులతో చేసిన ఆహార పదార్థాలను చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని సూచిస్తున్నారు.
అలాగే ఉడికించిన కూరగాయలు, పప్పు, చపాతి వంటివి రాత్రి పూట తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. పాలు, బాదం పప్పు, అరటిపండు, ఓట్స్ వంటివి తీసుకోవడం వల్ల మెదడు ప్రశాంతత చెంది మంచి నిద్ర పడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనికి విరుద్ధంగా రాత్రివేళల్లో కారం, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు, నూనెలో వేయించిన ఆహారాలు, ఫాస్ట్ ఫుడ్స్ తినకూడదు. అలాగే కాఫీ, టీ వంటి కెఫిన్ పానీయాలకు కూడా దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. రాత్రి నిద్రపోయే సమయానికి కనీసం 2 నుండి 3 గంటల ముందే భోజనం పూర్తి చేయడం మంచిది.
కాగా, ఈ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించడం ద్వారా శరీర బరువు అదుపులో ఉండటంతో పాటు జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి. రాత్రి భోజనంలో సరైన పోషకాహారాన్ని ఎంచుకోవడం ద్వారా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న చిన్న డైట్ మార్పులతో నిద్రలేమి సమస్యను సులభంగా నివారించవచ్చు.




