Health Tips: చర్మ సౌందర్యానికి ఆ ఆహారాలు శత్రువులే! మెరిసే చర్మం కావాలంటే వీటిని వెంటనే వదిలేయండి!

Health Tips: ఆరోగ్యకరమైన చర్మం కోసం కేవలం బయట పూసే క్రీములు మాత్రమే సరిపోవు, మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ముఖ్యం.

Arun Chilukuri
Published on: 13 April 2026 1:11 PM IST
Foods for Glowing Skin
X

Health Tips: చర్మ సౌందర్యానికి ఆ ఆహారాలు శత్రువులే! మెరిసే చర్మం కావాలంటే వీటిని వెంటనే వదిలేయండి!

Health Tips: ఆరోగ్యకరమైన చర్మం కోసం కేవలం బయట పూసే క్రీములు మాత్రమే సరిపోవు, మనం తీసుకునే ఆహారం కూడా ఎంతో ముఖ్యం. పోషకాలు ఉన్న ఆహారం చర్మాన్ని లోపలి నుంచి మెరిపిస్తే.. కొన్ని రకాల ఆహార పదార్థాలు చర్మాన్ని నిర్జీవంగా మార్చడమే కాకుండా మొటిమలు, ముడతలు వంటి సమస్యలకు కారణమవుతాయి.

చర్మానికి హాని చేసే ఆహారాలు ఇవే:

ఫాస్ట్ ఫుడ్స్ (బర్గర్లు, పిజ్జాలు): పార్టీలు, ఔటింగ్స్‌లో ఎంతో ఇష్టంగా తినే బర్గర్లు, పిజ్జాలు చర్మానికి ప్రధాన శత్రువులు. వీటి వల్ల చర్మంపై నూనె గ్రంథులు ఉత్తేజితమై మొటిమల సమస్య తీవ్రమవుతుంది.

నూనెలో వేయించిన పదార్థాలు: టీతో పాటు సమోసాలు, పకోడీలు తినడం చాలామందికి అలవాటు. కానీ, ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా చర్మం కాంతిని తగ్గిస్తాయి.

అతిగా మసాలాలు (Spicy Foods): ఆహారంలో మసాలాలు ఎక్కువగా ఉండటం వల్ల చర్మంపై దద్దుర్లు లేదా ఎర్రటి మచ్చలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జిడ్డు చర్మం (Oily Skin) ఉన్నవారు వీటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.

శీతల పానీయాలు & ఆల్కహాల్: సోడా, కూల్ డ్రింక్స్ మరియు ఆల్కహాల్ శరీరంలోని తేమను (Dehydration) తగ్గించేస్తాయి. దీనివల్ల చర్మం పొడిబారి, చిన్న వయసులోనే ముడతలు పడటం వంటి వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి.

ఏం చేయాలి?

మెరిసే చర్మం కోసం ఆకుపచ్చని కూరగాయలు, సీజనల్ పండ్లు మరియు తగినంత నీరు తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. జంక్ ఫుడ్‌కు బదులుగా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనానికి ప్రాధాన్యత ఇవ్వాలి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story