Chanakya tips for wealth: ఈ తప్పులు చేయకండి...ఇంటిని లక్ష్మీనిలయంగా ఇలా మార్చుకోండి
Chanakya tips for wealth: కొంతమంది ఎంత కష్టపడినా.. ఎంత సంపాదించినా ఆ సంపాదన ఇంట్లో కొంతకాలమైన నిలబడదు.
Chanakya tips for wealth: ఈ తప్పులు చేయకండి...ఇంటిని లక్ష్మీనిలయంగా ఇలా మార్చుకోండి
Chanakya tips for wealth: కొంతమంది ఎంత కష్టపడినా.. ఎంత సంపాదించినా ఆ సంపాదన ఇంట్లో కొంతకాలమైన నిలబడదు. సంపాదన ఎంత ఉన్నా.. లక్ష్మీదేవి ఇంట్లో నిలబడకపోవడం వెనుక పలు కారణాలున్నాయి. ఇందులో ఒక కారణం మన అలవాట్లు. మన అలవాట్ల గురించిన కొన్ని నైతిక సూత్రాలను ఆచార్య చాణక్యుడు స్పష్టంగా తెలియజేశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం, దారిద్య్రానికి కారణమయ్యే కొన్ని చిన్న చిన్న అలవాట్లు రోజువారి జీవితంలోనే దాగి ఉంటాయి. వాటిని సరిచేసుకుంటే ఇంట్లో ఐశ్వర్యం, శాంతి స్థిరపడతాయి.
శుభ్రత - మాటతీరు
చాణక్యుడు చెప్పిన నైతిక సూత్రాల్లో మొదటిది శుభ్రత. మన శరీరంతో పాటు మనం ధరించే దుస్తులు, ఇల్లు అన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. ఏ ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఇల్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. మురికిగా ఉండే వాతావరణంలో లక్ష్మీదేవి నిలవదని చాణక్యుడు స్పష్టం చేశాడు. అందుకే ప్రతీరోజూ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి. రోజూ దీన్ని అలవాటు చేసుకుంటే జీవితంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఇక రెండో సూత్రం మాటతీరు. మన మాటల్లో ఎప్పుడూ కఠినత్వం ఉండకూడదు. ఇతరులను కించపరచడం వలన సంబంధాలు దెబ్బతింటాయి. మించి మాట మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి మృదువైన భాషను ఉపయోగించాలి. తద్వారా మనకు గౌరవం లభిస్తుంది. అవసరమైన సమయంలో సహాయం కూడా లభిస్తుంది.
ఆహార నియంత్రణ
చాణక్యుడు చెప్పిన మూడో సూత్రం వ్యక్తిగత పరిశుభ్రత. ఇది అత్యంత ముఖ్యమైనది. ఉదయాన్నే దంతధావనంతో పాటు స్నానం చేయాలి. దంతధావనం చేసుకోవడం వలన ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు, ఆత్మవిశ్వాసానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మన పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. ప్రతిరోజూ ఒక నియమం ప్రకాచం ఒక సమయానికి స్నానం చేసి పనులు మొదలుపెట్టడం వలన పంచభూతాలు ఆ వ్యక్తికి సహకరిస్తాయి. నాలుగో నియమం ఆహార నియంత్రణ. అవసరానికి మించి తినడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మితాహారం పాటించడం వల్ల శరీరం చురుకుగా ఉండి, పని సామర్థ్యం పెరుగుతుంది. అతి ముఖ్యమైన ఐదో నియమం సమయపాలన. సూర్యోదయం తర్వాత నిద్రపోవడం అలవాటైతే జీవితంలో అవకాశాలు కోల్పోతాం. ఉదయం త్వరగా లేవడం విజయానికి మొదటి మెట్టు.
ఎవరైతే ఈ ఐదు నియమాలను పాటిస్తారో ఆ ఇంట్లో శాంతి, సంపద సహజంగా నిలుస్తాయి. చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు సాధించవచ్చని చాణక్యనీతి మనకు చెబుతున్నది. ఈ ఐదు సూత్రాలను విజయానికి ఐదు మెట్లుగా భావించి జీవితంలో అమలు చేస్తారో వారికి జీవితంలో ఎటువంటి లోటు ఉండదు.




