Air Cooler Cleaning Tips: కూలర్‌లో ముక్కుపగిలే చెడువాసన వస్తుందా... సింపుల్‌గా ఇలా క్లీన్‌ చేయండి

Air Cooler Cleaning Tips: సమ్మర్‌ ప్రారంభం కాగానే ప్రతి ఇంట్లో తప్పకుండా కూలర్‌ తిరుగుతుంది. కూలర్‌ని క్లీన్‌ చేయకుండా రోజంతా వినియోగిస్తే చెడు వాసన వస్తుంది.

Balachander
Published on: 6 April 2026 8:18 AM IST
Air Cooler Cleaning Tips
X

Air Cooler Cleaning Tips: కూలర్‌లో ముక్కుపగిలే చెడువాసన వస్తుందా... సింపుల్‌గా ఇలా క్లీన్‌ చేయండి

Air Cooler Cleaning Tips: సమ్మర్‌ ప్రారంభం కాగానే ప్రతి ఇంట్లో తప్పకుండా కూలర్‌ తిరుగుతుంది. కూలర్‌ని క్లీన్‌ చేయకుండా రోజంతా వినియోగిస్తే చెడు వాసన వస్తుంది. రోజంతా కూలర్‌ను వినియోగించే సమయంలో ఎంతో కొంత నీరు కూలర్‌లో నిల్వ ఉంటుంది. నీరు నిల్వ ఉండటం వలన దానిలో బ్యాక్టీరియా, ఫంగస్‌ వేగంగా పెరుగుతుంది. తద్వారా చెడువాసన వస్తుంది. ఇలా రోజుల తరబడి క్లీన్‌ చేయకుండా వాడితే ఆ సమస్య మరింత తీవ్రమౌతుంది. కూలర్‌లోని బ్యాక్టీరియా, ఫంగస్‌ గాలిద్వారా బయటకు వ్యాపించి రోగాలను కలిగించే అవకాశం ఉంటుంది. ఈ సమస్య నుంచి బయటపడటానికి కూలర్‌ను సింపుల్‌గా ఇలా క్లీన్‌ చేసుకోవచ్చు.

కూలర్‌ క్లీనింగ్‌

కూలర్‌ వాడే సమయంలో రెగ్యులర్‌గా నీటిని మారుస్తూ ఉండాలి. ఇది అత్యంత ముఖ్యమైన అంశం. కొంతమంది నాలుగైదు రోజులు అదే నీటిని వినియోగిస్తుంటారు. ఇలా ఎప్పుడు చేయకూడదు. 24 నుంచి 48 గంటలకు ఒకసారి ఖచ్చితంగా కూలర్‌లోని నీటిని తొలగించి తాజా నీటిని నింపాలి. దీని వలన కూలర్‌లో బ్యాక్టీరియా పెరుగుదల 60 నుంచి 70 శాతం వరకు తగ్గుతుంది. కూలర్‌ నుంచి చెడు వాసనలు రావడానికి మరో కారణం ప్యాడ్స్‌. ఇందులో వినియోగించే గడ్డి ప్యాడ్స్‌ లేదా హనీకాంబ్‌ ప్యాడ్స్‌ త్వరగా మురికి పడుతుంటాయి. వీటిపై దుమ్ముధూళి పేరుకుపోవడం వలన వాటి నుంచి దుర్వాసన వస్తుంది. కాబట్టి కనీసం వారానికి ఒకసారైనా ఈ ప్యాడ్స్‌ను క్లీన్‌ చేసుకోవాలి. మూడు నుంచి నాలుగు నెలలకు ఒకసారి ఈ ప్యాడ్స్‌ను మార్చుకుంటే కూలింగ్‌ పెరుగుతుంది.

యాంటి ఫంగల్‌

కూలర్‌ క్లీన్‌ చేయడం అంటే కేవలం నీటిని మారిస్తే సరిపోదు. వారానికి లేదా రెండు వారాలకు ఒకసారైనా ట్యాంక్‌ మొత్తం ఖాళీ చేసి సబ్బు లేదా వెనిగర్‌తో కడగాలి. వెనిగర్‌లో ఉండే యాంటి బ్యాక్టీరియల్‌ గుణాలు దుర్వాసనను తగ్గించడంతో పాటు అందులో చెడు పురుగులు పెరగకుండా చూస్తాయి. అంతేకాదు, ఈ నీటిలో కొద్దిగా నిమ్మరసం కలపడం వలన కూడా మంచి ఫలితం ఉంటుంది. కూలర్‌లో వాటర్‌ పంప్‌ను ఆన్‌ చేసే ముందు కనీసం 15 నుంచి 20 నిమిషాలపాటు ఫ్యాన్‌ మోడ్‌ను ఆన్‌ చేసుకోవాలి. దీని వలన కూలర్‌ లోపల తేమ తగ్గుతుంది. ఫంగస్‌ ఏర్పడకుండా ఉంటుంది. కూలర్‌ను గోడకు ఆనించి ఉంచకుండా... గాలి వెలుతురు ఉండే ప్రదేశంలో ఉంచాలి. ఇలా శుభ్రమైన అలవాట్లను పాటిస్తే కూలర్‌ నుంచి చెడు వాసన పూర్తిగా తగ్గిపోతుంది. చల్లని గాలిని ఆస్వాదించవచ్చు. ఇంట్లో ఆరోగ్యకరమైన వాతావరణం మీ ఇంట్లో ఉంటుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story