DVT symptoms : 8 గంటలు కుర్చీకే అతుక్కుపోతున్నారా? అయితే జర జాగ్రత్త..!

DVT symptoms : రోజూ 8-9 గంటల పాటు కుర్చీకే పరిమితమవుతున్నారా? అయితే మీకు 'డీప్ వెయిన్ థ్రాంబోసిస్' (DVT) ముప్పు పొంచి ఉండవచ్చు.

Ganesh
Published on: 28 March 2026 1:36 PM IST
DVT symptoms
X

DVT symptoms : 8 గంటలు కుర్చీకే అతుక్కుపోతున్నారా? అయితే జర జాగ్రత్త..!

DVT symptoms : ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి పెరిగిపోయింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల నుంచి ఆఫీస్ అసిస్టెంట్స్ వరకు చాలా మంది రోజుకు 8 నుంచి 9 గంటల పాటు కుర్చీకే పరిమితమవుతున్నారు. మీరు కూడా ఇలా గంటల తరబడి కదలకుండా కూర్చొంటున్నారా.. అయితే జాగ్రత్త. ఈ అలవాటు మీ కాళ్లలో రక్తం గడ్డకట్టేలా చేసి, ప్రాణాల మీదకు తెచ్చే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (DVT) అనే వ్యాధికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ వ్యాధి ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

DVT అంటే ..

శరీరంలోని లోతైన సిరలలో (ముఖ్యంగా కాళ్లలో) రక్తం గడ్డలు ఏర్పడటాన్ని DVT అంటారు. ఈ గడ్డలు ఒకవేళ అక్కడి నుంచి విడిపోయి రక్తప్రవాహం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటే, దానిని 'పల్మనరీ ఎంబోలిజం' అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి, కొన్నిసార్లు ప్రాణాంతకం కూడా కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ వ్యాధి కేవలం వృద్ధులకు లేదా సర్జరీ తర్వాత మంచానికే పరిమితమైన వారికి వస్తుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు 40 ఏళ్ల లోపు వయసున్న యువతలో 10 నుంచి 25 శాతం మంది దీని బారిన పడుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా డెస్క్ జాబ్స్ చేసే వారిల్లో కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కదలకుండా కూర్చోవడం వల్ల కాళ్ల కండరాలు పనిచేయవు, దీంతో రక్తం పైకి ప్రవహించకుండా అక్కడే నిలిచిపోతుందన్నారు. ఒకే భంగిమలో ఉండటం వల్ల సిరల లోపలి పొరలు దెబ్బతింటాయని చెప్పారు. నీరు తక్కువగా తాగడం, పని ఒత్తిడి వల్ల రక్తం చిక్కబడి గడ్డలు కట్టే అవకాశం పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు.

ఎలా రక్షించుకోవాలంటే..

ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు సూచించిన ఈ చిన్న మార్పులు మిమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి కాపాడతాయి. నిత్యం 8 నుంచి 9 గంటలు కూర్చోని పని చేసే వారు.. ప్రతి 60 నిమిషాలకు ఒకసారి సీటులోంచి లేచి, కనీసం 5 నిమిషాల పాటు నడవాలి. డెస్క్ మీద ఎప్పుడూ వాటర్ బాటిల్ ఉంచుకోని, తగినంత నీరు తాగడం వల్ల రక్తం చిక్కబడకుండా ఉంటుంది. ఎప్పుడు కూడా కాళ్ల మీద కాళ్లు వేసుకుని కూర్చోవద్దు. ఇది రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచించారు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story