Kodumur: డీఎస్సీ అక్రమాలపై కోడుమూరులో వైఎస్‌ఆర్‌సీపీ భారీ ర్యాలీ!

Kodumur: డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కోడుమూరులో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది.

C. Ganesh, Kodumuru
Published on: 10 Aug 2026 12:55 PM IST
Kodumur
X

Kodumur: డీఎస్సీ అక్రమాలపై కోడుమూరులో వైఎస్‌ఆర్‌సీపీ భారీ ర్యాలీ!

Kodumur: కోడుమూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల విషయంలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.కుడా మాజీ చైర్మన్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది.

స్పోర్ట్స్ కోటాలో అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని, అర్హత కలిగిన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు నినాదాలు చేశారు.

ఈ భారీ ర్యాలీలో కోడుమూరు నియోజకవర్గానికి చెందిన జడ్పీటీసీలు, ఎంపీపీలు, రాష్ట్ర, జిల్లా నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల కన్వీనర్లు, మాజీ చైర్మన్లు, కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అన్ని మండలాల గ్రామ నాయకులు, యువజన, విద్యార్థి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ర్యాలీ సందర్భంగా డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటానికి అండగా ఉంటామని నాయకులు స్పష్టం చేశారు.

స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. డీఎస్సీ అభ్యర్థుల సమస్య పరిష్కారం కోసం భవిష్యత్తులోనూ అవసరమైన కార్యక్రమాలు చేపడతామని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడుమూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే మణి గాంధీ, జెప్పిటిసి రఘునాథ్ రెడ్డి,మండల కన్వీనర్ రమేష్ నాయుడు,లీగల్ సెల్ ప్రభాకర్, గూడూరు అస్లాం,ప్రవీణ్,తది తరులు పాల్గొన్నారు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story