Yerragondapalem: వైఎస్సార్‌సీపీ ధర్నా: మంత్రి లోకేష్ రాజీనామాకు డిమాండ్!

Yerragondapalem: డీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

Srikanth Singam, Markapur
Published on: 6 Aug 2026 7:45 PM IST
Yerragondapalem
X

ఎర్రగొండపాలెం: డీఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం పట్టణంలో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నాయకత్వం వహించారు.

తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ప్రజలకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

నాలుగు రోజులపాటు ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఎమ్మెల్యే, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధర్నాను అడ్డుకునేందుకు కూటమి నాయకులు అన్ని విధాలుగా ప్రయత్నించారని ఆరోపించిన తాటిపర్తి చంద్రశేఖర్, ఎలాంటి ఒత్తిళ్లు, అడ్డంకులు వచ్చినా వైఎస్సార్‌సీపీ ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు.

ఈ ధర్నాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story