Nandikotkur: నందికొట్కూరు తహసీల్దార్‌కు వైఎస్సార్‌సీపీ వినతిపత్రం

Nandikotkur: నందికొట్కూరులో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సుధీర్ దారా ఆధ్వర్యంలో తాడుతో ట్రాక్టర్ లాగుతూ వినూత్న నిరసన.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 18 May 2026 5:26 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరు తహసీల్దార్‌కు వైఎస్సార్‌సీపీ వినతిపత్రం

Nandikotkur: రాష్టంలో ఎన్నడూలేని విధంగా పెట్రోలు,డీజల్ ధరల పెంచడం తీవ్ర ఆందోళన కరమైన విషయం అని నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ సమనవ్యకర్త డా”సుదీర్ దారా అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి అధికారంలోకి రాగానే చంద్రబాబు ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తుందని సమన్వయకర్త సుదీర్ ధ్వజమెత్తారు.

పెంచిన పెట్రోల్,డీజిల్ ధరలు వెంటనే తగించాలని సుదీర్ వినూత్నంగా నిరసన తెలిపారు. నందికొట్కూరు పటేల్ కూడలి మెయిన్ రోడ్డు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ట్రాక్టర్ కు తాళ్ళు కట్టి లాగుతూ చంద్రబాబు వైఖరి పై దుమ్మెత్తిపోశారు. అనంతరం సమనవ్యకర్త ధారా సుదీర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజల్ ధరలను తగిస్తామని టీడీపీ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చినప్పటికి,

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంద్రప్రదేశ్ లో పెట్రోల్, డీజల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని విస్మరించారు.ఇప్పటికే ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించక పొగ మరింత పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపు తుందని, ఈ ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారుస్తులు, మధ్య తరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతుందని తెలిపారు.

నిత్యావసర ధరలు కూడా పెరుగి ప్రజల జీవన వ్యయంపై మరింత భారం పడుతుందని అన్నారు టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజల్ ధరలు నియంత్రణ చేస్తామన్న చంద్రబాబు, లోకేష్ ప్రజలు హామీ ఇచ్చారు. పెంచిన పెట్రోల్,డీజల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసారు. పెరిగిన పెట్రోల్, డీజల్ పై 35% వ్యాట్ ను తగ్గించి ప్రజలపై భారాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ చర్యలు తీసుకోవాలని,పెట్రోల్, డీజల్ రేటు పెరిగితే మాకు ఏమి సంబంధం అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. మీరు టిఫిన్ చేయడానికి చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి పవన్.

మొన్న మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే జయసూర్య పబ్లిసిటీ స్టెంట్ కోసం సైకిల్ మరియు బైక్ పై తిరిగారు. ఒక్కరోజు కాదు రోజు ఇలాగే తిరగండి అన్నారు. నంద్యాల ఎంపీ శబరి గారు పెట్రోల్, డీజల్ తగించేలా లోకసభలో ప్రస్థావన చేసి సామాన్య ప్రజలపై పడే భారాన్ని తగ్గించాలని కోరుతున్ననని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాలు పాల్గొన్నారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story