Srisailam: కేసీ కెనాల్, బ్రహ్మంసాగర్, కుందుకి నీరు విడుదల చేయాలి!
Srisailam: నీటి మట్టం ఉన్నా కేసీ కెనాల్, బ్రహ్మంసాగర్, కుందు నదికి వెంటనే నీటిని విడుదల చేయాలని వైయస్ఆర్సీపీ నేత సంబటురు ప్రసాద్ రెడ్డి డిమాండ్ చేశారు.
Srisailam: కేసీ కెనాల్, బ్రహ్మంసాగర్, కుందుకి నీరు విడుదల చేయాలి!
Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాల్లో ఆలస్యంగా వర్షాలు కురిసినప్పటికీ ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు 879 అడుగుల నీటి నిల్వ ఉన్నది ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 885 అడుగులు, 60 వేల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో ఉన్నది గతంలో 875 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు కె.సి.కెనాల్ కు తెలుగుగంగకు నీరు వదలడం జరిగింది.
పవర్ జనరేషన్ పేరుతో పక్క రాష్ట్రాలు రోజుకు 60 వేల క్విసేకులు నీరు తోడేస్తున్నారు. మరోపక్క యదేచ్చగా తెలంగాణ ఎత్తిపోతల పథకం తో నీటిని తోడేస్తున్నారు, రబిలో ఇస్తాం వర్షాలు పడితే ఇస్తాం అంటున్నారు మీరు ఇచ్చే కాలానికి 854 అడుగుల నీరు చేరితే రాయలసీమతో పాటు వైఎస్ఆర్ జిల్లా ఎడారి అవుతుంది. ఈనెల ఆఖరుకు నీళ్లు వదులుతామని ప్రకటన చేయండి.
ఆరు తడిలు పంటలు జొన్న మినుము ,మొక్కజొన్న మొదలగు పంటలు వర్షాలు పడితే రైతులు సాగు చేసుకుంటారు లేని పక్షంలో కుందుపరివాక ప్రాంతంలో తాగునీటి స్కీములు పశువులకు త్రాగునీటి కోసమని కుందునదికి SKE ఛానల్ (నిప్పుల వాగు) ద్వారా నీటిని విడుదల 130 సంవత్సరాలు చరిత్ర కలిగిన కి.సి.కెనాల్ కు గతంలో తుంగభద్ర నుంచి పది టీఎంసీలు నీటి కేటాయింపు ఉన్నది దానికి డాక్టర్ వైయస్సార్ సీఎం అయిన తర్వాత తుంగభద్ర నీటిని HNSS కు మళ్లించి శ్రీశైలం నుండి పది టీఎంసీలు కేసి కెనాల్ కు కేటాయించారు కాబట్టి కచ్చితంగా నీటిని విడుదలచేయాలి కె.సి కెనాల్ ఆయకట్టు నంద్యాల వైయస్సార్ జిల్లాల ఆయకట్టు ప్రజాప్రతినిధులు అందరూ ప్రభుత్వంలో ఉన్నారు రైతులను దృష్టిలో పెట్టుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బాలయ్య యాదవ్, ఎంపీపీ సురేష్ యాదవ్, CK దీన్నే కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.




