Giddalur: వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్న వైనం..కామూరి రమణారెడ్డి స్పందన!

Giddalur: గిద్దలూరు వైసీపీలో బయటపడ్డ వర్గ విభేదాలు. తాను జనసేనలోకి వెళ్తున్నానన్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన కీలక నేత కామూరి రమణారెడ్డి.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 16 Sept 2026 1:52 PM IST
Giddalur
X

Giddalur: వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్న వైనం..కామూరి రమణారెడ్డి స్పందన!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గిద్దలూరు వైసిపి కీలక నేత కామూరి రమణారెడ్డి తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను జనసేనలోకి వెళ్తున్నామని వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ తన ఊపిరి ఉన్నంత వరకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి పని చేస్తానని ఆయనను సీఎం చేసుకోవడమే తదుపరి తన లక్ష్యమని అన్నారు.

2024 ఎన్నికలలో వైసిపి పార్టీకి వ్యతిరేకంగా పనిచేశానని ఇన్చార్జి నాగార్జున రెడ్డి ఫిర్యాదు చేశారన్న ఆరోపణలపై రమణారెడ్డి తీవ్రంగా స్పందించారు.తాను ఒక సాధారణమైన కుటుంబం నుంచి వచ్చి వైసిపికి పనిచేస్తున్నానని అన్నారు. అంతేకాకుండా గతంలో వైసిపి గుర్తుపై గెలిసిన అశోక్ రెడ్డి పార్టీని వీడి టీడీపీ లోకి వెళ్లిన సమయంలో కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీ బలోపేతం చేసేందుకు తమ కుటుంబం కృషి చేసిందన్నారు.

గిద్దలూరు వైసిపి ఇన్ ఛార్జ్ నాగార్జున రెడ్డి తో పాటు వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేలగా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర ఉందని అలాంటి వారు నాపై ఇలా మాట్లాడటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. జగనన్న ఆదేశాలతో వెంకటేశ్వర స్వామి, ప్రజల ఆశీస్సులతో అవకాశం వస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి జగనన్నకు గిద్దలూరు ఎమ్మెల్యే సీటును కానుకగా ఇస్తానన్నారు.

ఈనెల 17వ తేదీ నుంచి కొమరోలు మండలంలో కామురి కుటుంబం స్వయంగా పంచాయతీల వారీగా కార్యకర్తల వద్దకు వెళ్లి పలకరించడమే కాకుండా పది సంవత్సరాలపాటు తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతామని రమణారెడ్డి వెల్లడించారు.

సుభోజనం కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో పేదలందరికీ ఇంటికే ఆహారాన్ని అందించే కార్యక్రమం ఇప్పటికి చేపట్టినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని రమణారెడ్డి తెలిపారు. అనంతరం శుభోజనం ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రాన్ని ఆవిష్కరణ చేశారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU