Nandyal: డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి YSRCP

Nandyal: డీఎస్సీ నియామకాల అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని YSRCP ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శోభన్‌బాబు డిమాండ్ చేశారు.

P NAGESWARA RAO, SRISAILAM
Published on: 26 July 2026 10:53 AM IST
Nandyal
X

Nandyal: డీఎస్సీ అవకతవకలకు బాధ్యత వహిస్తూ లోకేష్ రాజీనామా చేయాలి YSRCP

నంద్యాల జిల్లా: ఏపీలో డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గంగుమాల శోభ‌న్‌బాబు డిమాండ్ చేశారు.

నీట్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగానే, రాష్ట్రంలో నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాలపై తలెత్తిన ఆరోపణలకు లోకేష్ బాధ్యత వహించాలన్నారు.

డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యత ఎవరిది? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అని రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని శోభ‌న్‌బాబు ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

P NAGESWARA RAO, SRISAILAM

P NAGESWARA RAO, SRISAILAM

Next Story