Devanakonda: ఆటో డ్రైవర్ మృతి.. కుటుంబానికి వైఎస్సార్‌సీపీ బోయ అంజి ఆర్థిక సాయం

Devanakonda: మృతి చెందిన ఆటో డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్సార్సీపీ నాయకుడు బోయ అంజి. రూ.10 వేల తక్షణ ఆర్థిక సాయం అందజేత.

G Jagadeesh, Pathikonda
Published on: 29 May 2026 10:47 AM IST
Devanakonda
X

Devanakonda: ఆటో డ్రైవర్ మృతి.. కుటుంబానికి వైఎస్సార్‌సీపీ బోయ అంజి ఆర్థిక సాయం

దేవనకొండ: కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ మృతి చెందిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బోయ అంజి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారి బాధలో తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే మృతుడి కుటుంబానికి తక్షణ సహాయంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.

G Jagadeesh, Pathikonda

G Jagadeesh, Pathikonda

Next Story