Nandikotkur: నందికొట్కూరులో పోలీసుల నోటీసులు ధిక్కరించి వైకాపా ర్యాలీ!

Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరులో డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)
Published on: 10 Aug 2026 2:09 PM IST
Nandikotkur
X

Nandikotkur: నందికొట్కూరులో పోలీసుల నోటీసులు ధిక్కరించి వైకాపా ర్యాలీ!

Nandikotkur: నంద్యాల జిల్లా డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు నిరసనగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నందికొట్కూరులో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

పార్టీ కార్యాలయం నుండి మిడ్తూరు రోడ్డు మీదుగా అంబేద్కర్ సర్కిల్ వరకు జరిగిన ఈ ర్యాలీకి పార్టీ సమన్వయకర్త డా. సుద్దీర్ దారా, నియోజకవర్గ పరిశీలకుడు బుడ్డా శేషిరెడ్డి నాయకత్వం వహించారు.

ర్యాలీలో నిరుద్యోగులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని "డీఎస్సీ అవకతవకలపై నారా లోకేష్ రాజీనామా చేయాలి" అంటూ నినాదాలు చేశారు.

ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు సమన్వయకర్త సుద్దీర్‌కు నోటీసులు అందజేశారు. దీనిపై స్పందించిన సుద్దీర్, "ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ర్యాలీ చేసుకునే హక్కు కూడా లేదా? ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం" అని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చినప్పటికీ వెనక్కి తగ్గకుండా ర్యాలీని కొనసాగించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన సుద్దీర్, శేషిరెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. "స్పోర్ట్స్ కోటాలో నిరుద్యోగులను మోసం చేసి ఫేక్ సర్టిఫికెట్లు ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత లోకేష్‌ది" అని ఆరోపించారు.

రాష్ట్రంలో శాంతియుత ర్యాలీలను సైతం పోలీసుల సహాయంతో అడ్డుకునే కుట్రకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. "ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల పక్షాన, నిరుద్యోగుల పక్షాన మేము పోరాడుతాము" అని హెచ్చరించారు.ఈ ర్యాలీతో నందికొట్కూరులో డీఎస్సీ అంశం మరోసారి వేడెక్కింది.

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Iman Raju, Nandikotkur(Kurnool Dist)

Next Story