Kurnool: మెగా డీఎస్సీపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు: ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్!

Kurnool: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ తెర్నేకల్ వెంకప్ప దేవనకొండలో మాట్లాడారు.

M Jagadeesh
Published on: 10 Aug 2026 7:23 PM IST
Kurnool
X

Kurnool: మెగా డీఎస్సీపై అవగాహన లేకుండా మాట్లాడొద్దు: ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్!

కర్నూలు: మెగా డీఎస్సీపై అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదు తాగునీరు, సాగునీటి సమస్యలపై వైసీపీ నాయకులు కలిసికట్టుగా పోరాడాలి – ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ తెర్నేకల్ వెంకప్ప ఆలూరు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన తాగునీరు, సాగునీటితో పాటు మెగా డీఎస్సీ అంశంపై వైసీపీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందని ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ తెర్నేకల్ వెంకప్ప అన్నారు.

మెగా డీఎస్సీ విషయంలో పూర్తి అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవాలను పూర్తిగా తెలుసుకోకుండా అనవసర వ్యాఖ్యలు చేయడం వల్ల నిరుద్యోగ యువతలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇకనైనా మెగా డీఎస్సీపై వాస్తవాలను తెలుసుకుని బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు.ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు మెగా డీఎస్సీ ద్వారా ఉపాధి అవకాశాలు లభించడం సంతోషకరమైన విషయమన్నారు.

తెర్నేకల్ గ్రామానికి చెందిన 25 మంది అభ్యర్థులు తమ ప్రతిభ, మెరిట్‌తో ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడం గ్రామానికి గర్వకారణమని వెంకప్ప అన్నారు.ఎన్నో సంవత్సరాల నిరీక్షణ, కష్టపడి చదివిన ఫలితంగా 25 మంది యువత ఉద్యోగాలు సాధించారని, ఇది వారి ప్రతిభ, పట్టుదలకు నిదర్శనమన్నారు.

ఉద్యోగాలు సాధించిన యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అదేవిధంగా ఆలూరు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలు, రైతుల సాగునీటి ఇబ్బందులపై వైసీపీ నాయకులు ప్రత్యేక దృష్టి సారించాలని వెంకప్ప పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు.

మెగా డీఎస్సీపై వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి.. ప్రజా సమస్యలపై మాత్రం అందరం ఐక్యంగా పోరాడాలి. వ్యక్తిగత విమర్శలు, అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ తెర్నేకల్ వెంకప్ప స్పష్టం చేశారు.

M Jagadeesh

M Jagadeesh

Next Story