Kodumur: కోడుమూరులో వైఎస్సార్ విగ్రహానికి అవమానం.. ముళ్లపొదల్లో విగ్రహం!

Kodumur: కోడుమూరులో వైఎస్సార్ విగ్రహాన్ని పెకిలించి ముళ్లపొదల్లో పడవేసిన దుండగులు. స్థల యజమానే తొలగించారని స్థానికుల అనుమానం.

C. Ganesh, Kodumuru
Published on: 6 Jun 2026 8:36 AM IST
Kodumur
X

Kodumur: కోడుమూరులో వైఎస్సార్ విగ్రహానికి అవమానం.. ముళ్లపొదల్లో విగ్రహం!

Kodumur: కోడుమూరులో వైఎస్సార్ విగ్రహానికి అవమానం జరిగింది. విగ్రహాన్ని పెకిలించి ముళ్లపొదలలోకి గుర్తుతెలియని వ్యక్తులు విసిరేశారు. కర్నూలు ప్రధాన రహదారిలో కోట్ల విలువైన తన స్ధలంలో మాజీ వైసిపి ఎంఎల్ఏ సుధాకర్ అనుచరుడు అద్దుగల రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేశారు. ఎన్నికల అనంతరం రాజశేఖర్ రెడ్డి వైసిపి ని వీడారు.

సంవత్సరం క్రితం గుర్తు తెలియని దుండగులు విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు.కొత్త విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారనుకుని ఎదురు చూసిన వైఎస్సార్ అభిమానులకు విగ్రహాన్ని పెకిలించి వేయడంతో నిర్ఘాంతపోయారు. స్ధల యజమానే తొలగించి వుంటాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసిపి నాయకులు ఘటనపై స్పందించలేదు.

C. Ganesh, Kodumuru

C. Ganesh, Kodumuru

Next Story