Markapuram: దోర్నాలలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు!

Markapuram: ఎర్రగొండపాలెం దోర్నాలలో వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు. వైఎస్సార్ విగ్రహానికి పాలతో అభిషేకం, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన నేతలు.

Srikanth Singam, Markapur
Published on: 2 Sept 2026 12:20 PM IST
Markapuram
X

Markapuram: దోర్నాలలో ఘనంగా వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలు!

Markapuram: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని వైఎస్సార్‌సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. దోర్నాల నటరాజ్‌ సెంటర్‌లోని వైఎస్సార్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్‌ గంటా రమణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, పాలతో అభిషేకం చేశారు. అనంతరం రమణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి, పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు.

అనంతరం దోర్నాల ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన వైఎస్సార్‌సీపీ నాయకులు అక్కడ చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి పండ్లు, బ్రెడ్‌ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, ఉమ్మ ఎల్లేష్ అల్లు రాంభూపాల్ రెడ్డి కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur

Next Story