Yemmiganur: బనవాసి గురుకుల పాఠశాల ప్రాంగణంలో జేసీబీతో పారిశుధ్య పనులు
Yemmiganur: బనవాసి గురుకుల పాఠశాలలో పిచ్చిమొక్కలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం టీడీపీ నాయకుడు మాచాని సోమనాథ్ సొంత ఖర్చుతో జేసీబీతో ప్రాంగణాన్ని శుభ్రం చేయించారు.
Yemmiganur: బనవాసి గురుకుల పాఠశాల ప్రాంగణంలో జేసీబీతో పారిశుధ్య పనులు
ఎమ్మిగనూరు: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి గురుకుల బాలికల విద్యాలయంలో రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మాచాని సోమనాథ్ పర్యటించారు.
ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించిన ఆయనకు.. స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు భారీగా పెరిగిపోవడంతో విద్యార్థులు బాత్‌రూమ్‌లకు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారని, పాములు, ఇతర విషపూరిత కీటకాల సంచారంతో విద్యార్థులకు భద్రతాపరమైన సమస్యలు ఎదురవుతున్నాయని స్కూల్ యాజమాన్యం వివరించింది.
దీంతో వెంటనే స్పందించిన మాచాని సోమనాథ్.. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మానవతా దృక్పథంతో సొంత ఖర్చుతో జేసీబీ ఏర్పాటు చేసి పాఠశాల పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయించారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అడుగుజాడల్లో నడుస్తూ పాఠశాలలను సందర్శిస్తున్నామని, విద్యార్థులు సురక్షితమైన వాతావరణంలో చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం చేశామని మాచాని సోమనాథ్ తెలిపారు.




