Markapur: గిద్దలూరు సబ్ జైల్ ని సందర్శించిన న్యాయమూర్తి

Markapur: ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా గిద్దలూరు సబ్ జైలును తనిఖీ చేసిన న్యాయమూర్తి భరత్ చంద్ర.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 7 Jun 2026 7:19 PM IST
Markapur
X

Markapur: గిద్దలూరు సబ్ జైల్ ని సందర్శించిన న్యాయమూర్తి

మార్కాపురం జిల్లా: గిద్దలూరు ఆదివారం ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని గిద్దలూరు న్యాయమూర్తి భరత్ చంద్ర సబ్ జైల్ ని సందర్శించారు. ఖైదీలకు అందుతున్న సదుపాయాలను పరిశీలించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు.

అంతేకాకుండా ఖైదీలతో కలిసి న్యాయమూర్తి భోజనం చేయడం జరిగింది, ఆహారం నాణ్యత పై సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత ఖైదీల సమస్యలను అడిగి తెలుసుకుని న్యాయ సహాయం అందిస్తామని వారికి తెలిపారు. అలానే నేర ప్రవృత్తిని సత్ప్రవర్తనతో మెలగాలని ఖైదీలకు న్యాయమూర్తి భరత్ చంద్ర సూచించారు. కార్యక్రమంలో జైల శాఖ అధికారులతో పాటు న్యాయవాదులు పాల్గొన్నారు.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU

Next Story